Actress Tabu: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముద్దుగుమ్మ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ముఖ్యంగా నాగార్జునతో కలిసి ఈమె నటించిన సినిమాలకు విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి.వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో పర్ఫెక్ట్ గా వర్కౌట్ కావడంతో చాలామంది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఊహగానాలు కూడా అప్పట్లో వినిపించాయి.
నాగార్జునతో ఉన్న రిలేషన్ కారణంగానే నటి టబూ పెళ్లికి కూడా దూరంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలను ఈమె చాలా లైట్ తీసుకున్నారు. ఇకపోతే నటి టబు ప్రస్తుతం 51 సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించని ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకోవాలని కోరిక తనకు కలిగిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ ఈమె మగవారిపై నమ్మకం లేక ఇన్ని రోజులు పెళ్లికి దూరంగా ఉందనే వార్తలు వచ్చినప్పటికీ మరికొందరు మాత్రం నాగార్జునతో ఉన్న అఫైర్స్ కారణంగానే టబు పెళ్లి చేసుకోలేదని వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈమెకి పెళ్లి పై మనసు పడటంతో ఒక విడాకులు తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోతో రిలేషన్ లో ఉందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.
ఈ విధంగా టబు 51 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు రాగానే ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అంటూ కొందరు కామెంట్లు చేయగా ఇన్ని రోజులకు పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగిందా అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై నటి టబు స్పందించాల్సి ఉంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…