Actress Trisha:కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు విజయ్ నెంబర్ వన్ హీరో అంటూ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. విజయ్ నెంబర్ వన్ హీరో అనడంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే దక్షిణాది సిని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి త్రిష తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమె నటించిన చిత్రం రాంగి.ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురవడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
హీరో విజయ్ అజిత్ ఇద్దరూ కూడా ఎంతో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు.వీరిద్దరిలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పడం చాలా కష్టమని వీరిద్దరూ కూడా ఒకే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలని ఈమె సమాధానం చెప్పారు. వ్యక్తిగతంగా తనకు నెంబర్ గేమ్స్ పై ఏమాత్రం నమ్మకం లేదని తెలిపారు.
మనం నటించిన చివరి సినిమా విజయం అందుకుంటే మనమే నెంబర్ వన్ అని లేదంటే ఆ స్థానంలోకి మరొకరు వస్తారని తెలిపారు.తాను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి అజిత్ విజయ్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్టార్డం ఉన్న హీరోలుగా పేరుపొందారు. ఇలా ఈ ఇద్దరు హీరోలలో నెంబర్ వన్ ఎవరో చెప్పడం కష్టమని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై త్రిష షాకింగ్ కామెంట్స్ చేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…