Actress Vanitha Vijay Kumar : నరేష్, పవిత్ర లోకేష్ వీళ్ళిద్దరు, ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఆ మధ్య కాలంలో జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టా పట్టాలేసుకుని ఇద్దరు తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళుప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచ్చకీడ్చింది. ఈ ఇష్యూ అంత తెగ వైరల్ అయి ఈ మధ్యనే సైలెంట్ అవ్వగానే తాజాగా మళ్ళీ పెళ్లి అంటూ నరేష్ ,పవిత్ర లోకేష్ సినిమా చేసారు. ఇక ఈ సినిమాలో రమ్య రఘుపతి క్యారెక్టర్ ను వనిత విజయ కుమార్ పోషించారు. అయితే ఆమె ఇటీవల ఇంటర్వ్యూ ఆ క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

ఆమె పాత్ర అని నాకు తెలియదు….
దేవి సినిమాలో కలిసి పనిచేయడం వల్ల డైరెక్టర్ ఏంఎస్ రాజు గారు అడుగగానే మళ్ళీపెళ్లి సినిమాలో నటించానని స్టోరీ చెప్పినపుడు ఒక పవర్ ఫుల్ లేడీ పాత్ర ఇందులో మీది అని మాత్రమే చెప్పారు అంటూ వనిత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

సినిమాలో తన క్యారెక్టర్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి క్యారెక్టర్ అని తనకు తెలియదని సినిమా చూసే వరకు ఆ విషయం తెలియదని చెప్పారు. ఈ సినిమా విడుదల కాకూడదని రమ్య రఘుపతి కోర్ట్ కి ఎక్కిన విషయం తెలిసిందే. తన క్యారెక్టర్ ను నెగెటివ్ గా చూపించారు అంటూ రమ్య ఈ సినిమా గురించి కోర్టు ను ఆశ్రయించింది.