Actress Vinaya Prasad: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ మలయాళ భాషలలో నటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి వినయ ప్రసాద్ ఇంట్లో దొంగలు పడిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంద్ర, ఆంజనేయులు, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే వంటి తదితర సినిమాలలో నటించి సందడి చేశారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించి సందడి చేసిన వినయ ప్రసాద్ బెంగళూరులో నందిని లేఔట్ లో నివాసం ఉంటున్నారు. అయితే దీపావళి పండుగను పురస్కరించుకొని ఈమె తన భర్తతో కలిసి ఉడిపి వెళ్లారు.ఈ విధంగా ఉడిపిలో దీపావళి పండుగను జరుపుకున్న అనంతరం ఈమె తిరిగి బెంగుళూరు వెళ్లారు.

Actress Vinay Prasad: డబ్బును దోచుకెళ్లిన దొంగలు…
ఈ విధంగా 26వ తేదీ సాయంత్రం బెంగళూరుకు వెళ్లినటువంటి వినయ ప్రసాద్ తన ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో తన ఇంట్లో దొంగతనం జరిగిందని భావించి వెంటనే లేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే దొంగలు తన ఇంటి తాళాలను పగలగొట్టి లాకర్ లోపల ఉన్నటువంటి డబ్బును తీసుకెళ్లిపోయారని ఈమె వెల్లడించారు. ఇలా నటి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే ఆమె ఇంట్లో ఎంత మొత్తంలో డబ్బు దొంగలించబడిందనే విషయాలు మాత్రం తెలియడం లేదు.




























