Actress Yamuna : మామగారు, మౌన పోరాటం వంటి సినిమాలు గుర్తుకు వస్తే అందులో హీరోయిన్ గా నటించిన యమున అందరికీ గుర్తుకు వస్తుంది. తెలుగులో ఎమోషనల్ సాఫ్ట్ రోల్స్ చేసిన యమున అసలు పేరు ప్రేమ. బెంగళూరు లో జన్మించిన ఆమె బాలచంధర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆయనే ఆమె పేరును ప్రేమ నుండి యమున గా మార్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన యమున ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం వంటి పలు భాషలలో సినిమాలను చేసారు. ముఖ్యంగా కన్నడ లో 50కి పైగా సినిమాలను తెలుగులోనూ అత్యధిక సినిమాలను చేసిన ఆమె తెలుగులో సీరియల్స్ ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యారు. అన్వేషిత, విధి వంటి సీరియల్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న యమున తన కెరీర్ గురించిన విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

స్టార్ హీరోస్ తో చేయకపోడానికి కారణం అదే…
యమున మౌనపోరాటం సినిమాతో అవార్డులే కాకుండ హిట్ ను తన కాతాలో వేసుకుని మంచి అవకాశాలను అందుకున్నారు. నటన పరంగా తానేంటో నిరూపించుకున్న యమున కమర్షియల్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అప్పట్లో మంచి స్టార్ డమ్ వచ్చినా కూడా అప్పటి అగ్రహీరోలతో నటించలేక పోయింది. యమున దీనికి గల కారణాలను చెబుతూ తనను సాఫ్ట్ అలాగే ఎమోషనల్, డి గ్లామర్ పాత్రలలో ఎక్కువగా ఆదరించడం వల్ల ఇండస్ట్రీ వర్గాలు కూడా కమర్షియల్ హీరోయిన్ గా నేను సూట్ అవ్వను అని భావించి అలాంటి పాత్రలు ఇవ్వలేదు.

అలా పెద్ధ హీరోల సినిమాలను చేయలేకపోయాను. ఇక మరొక కారణం అప్పట్లో బిజీగా ఉండటం, ఆల్రడీ కొన్ని సినిమాలకు కమిట్ అవడం వల్ల పెద్ధ బ్యానర్స్ తో వచ్చిన అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పారు. ఇక ఇపుడు టాక్సీవాలా సినిమాలో నటించిన యమున మళ్ళీ సినిమాల్లో నటించకపోడానికి కారణాలను వివరించారు. సీరియల్స్ చేయడం వల్ల బిజీ షెడ్యూల్ లో సినిమాలకు కేటాయించలేక వదులుకుంటున్నట్లు, అదీ కాక సీరియల్స్ లో నాదే కీలక రోల్ ఉంటుంది సినిమాలో అలా కాదు కదా. అలాంటప్పుడు సినిమాల కన్నా సీరియల్స్ బెటర్ అనిపిస్తుంది అంటూ వివరించారు.




























