Adavi shesh : ఇండస్ట్రీ ఇప్పటి తరం హీరోల్లో సొంతంగా కష్టపడి పైకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని విజయ్ దేవర కొండ, అడవి శేష్, విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి వంటి వారు గుర్తొస్తారు. ఇక విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వీళ్ళు వారి ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటున్నారు. ఇక వీరిలో అడవి శేష్ చిన్న పాత్రాలతో మొదలై ఇపుడు హీరోగా మంచి కథలతో అలరిస్తున్నాడు. కిస్, గూఢచారి, క్షణం వంటి సినిమాలతో అలరించిన అడవి శేష్ తాజాగా మరో కొత్త సినిమాతో వస్తున్నాడు.

అడవి శేష్ నటించిన కొత్త చిత్రం మేజర్ ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం అడవి మునుపెన్నడు లేనట్టుగా ఇండియా మొత్తం తిరిగి ప్రచారం చేస్తున్నాడు.

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అడవి శేష్ ని వివాహం గురించి అడుగగా బాహుబలి ప్రభాస్, దేవసేన అనుష్క లకే ఇంక పెళ్లి అవ్వలేదు ఇక నా పెళ్ళికి తొందరేముంది.. వాళ్లే ఇంకా సింగల్ గా ఉన్నారు మరి నేనెంత అని అనగానే అక్కడ అందరూ నవ్వేశారు. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. జూన్ 3 న విడుదలకు సిద్దమైన మేజర్ సినిమా ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో అంచనాలను పెంచేసింది































