Aditya Om : ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో హీరోగా నటించిన ఆదిత్య ఓం ఆదిత్య గా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అయితే ఇప్పటివారికి ఆదిత్య అంత తెలియకపోవచ్చు కానీ ముందు వారికి లాహిరి లాహిరి సినిమా ద్వారా తెలుసు. ఇక ఆ సినిమా తరువాత ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, ధనలక్ష్మి ఐ లవ్ యూ, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు వంటి సినిమాలలో నటించాడు. ఆదిత్య ఉత్తర ప్రదేశ్ కి చెందిన వ్యక్తి. ఇక సినిమాల మీద ఆసక్తి తో తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చారు. ప్రొడక్షన్ వైపు కూడా పనిచేసిన అనుభవం ఆదిత్యకు ఉంది. ఇక డైరెక్టర్ గా కూడా సినిమాలను తీసి అవార్డులను సొంతం చేసుకున్నాడు.

అవసరాల కోసం ప్రొడక్షన్ మేనేజర్ గా…
సినిమాల్లో నటించిన ఆదిత్య కు ఆవకాశలు పెద్దగా రాలేదు. వచ్చిన సినిమాల్లో చాలా మటుకు ప్లాప్ అవ్వడంతో ఇక దాదాపు గా సినిమా కెరీర్ ముగిసింది. ఇక ప్రొడక్షన్ వైపు ముందు నుండి పని తెలియడం వల్ల మళ్ళీ ఆ వైపు వెళ్ళాడు ఆదిత్య. తన స్నేహితుల సినిమాలకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రొడక్షన్ వైపు అడుగుపెట్టాడు. ప్రస్తుతం సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తూ హిందీ ఇండస్ట్రీ లో ఉన్నాడు.

అలా ప్రొడక్షన్ మేనేజర్ గా వచ్చిన సినిమా ‘శుద్ర’ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతోంది. ఇక ఆ సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నాడు. ఇక ఆదిత్యది ఉత్తర్ ప్రదేశ్ అయినా కూడా తెలంగాణ లోని చేరుపల్లి అనే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో విద్యార్థుల కోసం లైబ్రరీ వంటి సౌకర్యాలను కల్పించి విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకువచ్చారు. అలా సామాజిక సేవలోనూ ముందున్నారు. లాప్ టాప్ లు, సోలార్ లైట్స్ లాంటి వసతులు ఆ గ్రామానికి కల్పిస్తున్నారు ఆదిత్య.
































