Advocate Udaykanth : రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమందితో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తొలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డి కి అంతకుముందు ప్రేమ వ్యవహారం ఉందనే ప్రచారం బయట జరుగుతోంది. అయితే ఈ ఇష్యూలో ఇప్పటివరకు నవీన్ రెడ్డిని అరెస్టు చేసారో లేదో ఎవరికీ తెలియదు.

ఏ సెక్షన్ల కింద కేసులు…
నవీన్ రెడ్డి, వైశాలి ఇష్యూలో అసలు నవీన్ కి పడే శిక్ష ఏమిటి అనే విషయం గురించి అడ్వకేట్ ఉదయ్ కాంత్ ఆయన అభిప్రాయాలను తెలిపారు. నవీన్ రెడ్డి, వైశాలి మధ్య ప్రేమ వ్యవహారం జరిగింది అని నవీన్ చెబుతున్నారు. ఆ అమ్మాయి పేరు మీద వోల్వో కారు ఉందంటూ ప్రచారం నేపథ్యంలో ఒకవేళ ఆ అమ్మాయి ప్రేమించి మళ్ళీ మనసు మార్చుకుని ఉంటే ఆ అమ్మాయి మీద చీటింగ్ కేసు నమోదు చేయొచ్చు. ఇది ఒక కోణం అయితే నవీన్ రెడ్డి ఆ అమ్మాయి వెంటపడి నాకే దక్కాలి అనే ఉద్రేక పూరిత ఆలోచనతో 100 మందిని తీసుకుపోయి దాడి చేయడం తప్పు.

అలా దాడి చేసిన ఒక 32 మందిని అరెస్టు చేసారు. మిగిలిన వారిని ఇంకా చేయలేదు. ఇక నవీన్ రెడ్డి అరెస్టు అయ్యాడో లేదో ఎవరికీ తెలియదు. అతను చేసిన ఈ పని వల్ల అతని మీద సెక్షన్ 147, సెక్షన్ 148, అలాగే 307 అలాగే 363 సెక్షన్ల కింద నవీన్ మీద A1 గా నమోదు చేసారు. అయితే ఇంత గొడవ చేశాడంటే అతనితో వైశాలి తో పెళ్లయింది అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయో, అవి మరి కొద్ది రోజుల్లో బయటపెట్టొచ్చు. పెళ్లి జరిగింది ఫోటోలు తీసుకున్నాం అంటున్నాడు అవి బయటపెట్టే ఛాన్స్ ఉంది అంటూ అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు అభిప్రాయపడ్డారు.



























