సమంత నాగ చైతన్యల వైవాహిక జీవితానికి 4 సంవత్సరాల తర్వాత ముగింపు పలికారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి వివాహ బంధంలో పలు మనస్పర్థలు చోటు చేసుకోవటం వల్ల వీరిద్దరూ వివాహ బంధం నుంచి విడిపోయి ఒంటరిగా జీవించాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీ విడాకులు తీసుకోబోతున్నాం అంటూ నాగచైతన్య సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఒక్కసారిగా ఇలాంటి చేదు వార్తను చెప్పడంతో ఇది నిజంగానే అభిమానులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పవచ్చు. ఇలా విడాకులు అనంతరం సమంత గచ్చిబౌలిలోని తన ఇంటిలో నివాసం ఉంటారని సమంత సన్నిహితవర్గాలు తెలియజేశారు.ఇకపోతే విడాకుల తర్వాత నాగచైతన్య కూడా అక్కినేని కుటుంబానికి దూరం కానున్నారు.
నాగచైతన్య జూబ్లీ హిల్స్ ఏరియాలో ఖరీదైన అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారని సమాచారం. ప్రస్తుతం కొన్ని పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని ఇవి పూర్తికాగానే నాగచైతన్య ఆ ఫ్లాట్ కు వెళ్లి అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ, బంగార్రాజు, లాల్ సింగ్ చద్దా అన్ని సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…