“అందాల రాక్షసి” చిత్ర కథానాయకుడు నవీన్ చంద్రకి అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఎక్కువే. తెలుగులో చేసింది 5,6 చిత్రాలే అయినా ‘అందాల రాక్షసి’ చిత్రంతో మాత్రం ఎంతో మంది మగువల మనసును దోచేశాడు ఈ యంగ్ హీరో. ఈ బళ్లారి బుల్లోడికి చాలా లవ్ స్టోరీ ఉండటమే కాదు.. తన వెంటపడ్డ అమ్మాయిల లిస్ట్ ను చెప్పుకొస్తూ కమెడియన్ అలీ హోస్ట్ చేసే ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన నవీన్ చంద్ర కొన్నిఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు.

ఈ షోలో పాల్గొన్న నవీన్ చంద్ర మాట్లాడుతూ.. తన అసలు పేరు ప్రదీప్‌ అని, తాను పుట్టింది హైదరాబాద్.. పెరిగింది మాత్రం బళ్లారి.. గాలి జనార్థన రెడ్డి మా నైబర్ అంటూ తన గతాన్ని చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చెబుతూ.. అప్పట్లో చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు బళ్లారి నుంచి గుంతకల్లు 57 కిలోమీటర్లు వెళ్లేవాడిని.. ఆ సినిమా రిలీజ్ రోజున బాక్స్ తీసుకువచ్చేందుకు గొడవపడేవాళ్లము.. ఆపోజిట్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అవ్వకుండా అడ్డుకున్నా టైంకి ఎలాగోలా బాక్స్ తీసుకుని థియేటర్‌కి వచ్చి షర్ట్ విప్పి చిందులేసేవాడిని,తెలుగులో చిరంజీవి.. తమిళ్‌లో కమల్ తనకు ప్రేరణ అని చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర.

అలాగే తన పర్సనల్ లైఫ్ లో ఎదురైనా లవ్ స్టోరీలు గురించి సిగ్గుపడుతూ చెబుతూ.. “అందాల రాక్షసి” చిత్రం తర్వాత చాలామంది అమ్మాయిలు వెంటపడేవారు. నాకు గిఫ్ట్ గా కొందరు టీషర్ట్స్ పంపించేవారు. మరికొందరు అండర్ వేర్‌లు కూడా పంపించారు. మరి నా సైజ్ వాళ్లకు ఎలా తెలుసో తెలియదు కాని చాలా పంపేవారు. ఆ తరువాత వాటిని మా ఇంటి ఓనర్ చూసి వాట్ ఈజ్ దిస్ అని నిలదీసింది. ‘అందాల రాక్షసి’ మూవీ విడుదలైన రోజు నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వచ్చేవి.. ఎక్కువగా అమ్మాయిలు చేసేవారు. నవీన్ చంద్రా.. అని గట్టిగా అరవడం, ఐ లవ్ యూ అనడం చేసేవారు. సినిమా విడుదలైన మూడో రోజు నుంచి వరుసగా ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వకుండా ఓ నెంబర్ నుంచి కాల్ వచ్చేది. నేను ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాను.

మూడో రోజు ఆన్ చేసేసరికి ఆ ఫోన్ చేసిన అమ్మాయి మెసేజ్ చేసింది. నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ నెం.7లో ఉన్నాను.. రాకపోతే బాగోదని ఏం జరుగుతుందో చూడు అని మెసేజ్. నాకు అప్పుడు కంగారు వచ్చి ఫ్రెండ్‌కి కాల్ చేసి.. ఇద్దరం కలిసి వెళ్లాం. ఆమె నన్ను చూసి ఏడ్చేసింది.. ఇంట్లో నుంచి నగలతో పాటు.. విలువైన వస్తువుల్ని తీసుకుని నాకోసం వచ్చేసింది. అలా నా కోసం రావడం నిజంగా నాకు ఆశ్చర్యమేసింది.’ అంటూ చెప్పుకొచ్చిన నవీన్ చంద్ర.. “RX100 సినిమాలో ముందు నేను నటించాల్సింది. ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ముందు ఆ కథ నాకు చెప్పినపుడు కొంతమంది నిర్మాతలకు పరిచయం చేయించాను. కానీ ఎవరు కూడా నా మీద అంత పెద్ద బడ్జెట్ పెట్టడానికి ముందుకి రాలేదు” అంటూ ఆ సినిమా ఛాన్స్ ఎలా మిస్సయ్యిందో తెలియజేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here