Akhil Sarthak : బిగ్ బాస్ ద్వారా మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి అఖిల్ సార్థక్. రెండు సార్లు బిగ్ బాస్ లో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచిన అఖిల్ మొదటి సారి పాల్గొన్న బిగ్ బాస్ లో మోనాల్ తో ప్రేమాయణం ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఇక మా టీవీ లో వివిధ షోలలో హల్ హల్ చేసిన అఖిల్ ఢీ షోలో కూడా యాంకర్ గా మెరిసాడు. ఇక తాజాగా పలు సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న అఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.

ఈ ఫేక్ ప్రపంచానికి గుడ్ బై…
నేటి లైఫ్ స్టైల్ లో సోషల్ మీడియాలో మనలో ఒక భాగమైంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతోంది. తమ అభిమానులతో టచ్ లో ఉండటానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. అలా చిన్నా పెద్ధ అని తేడా లేకుండా చాలా మంది సినిమా, బుల్లితెర తారలు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ డైలీ అప్ డేట్స్ అభిమానులకు అందుబాటులో ఉంచుతున్నారు.

అయితే ఒక్కోసారి ఈ సోషల్ మీడియానే చాలా మంది డిప్రెషన్ కి కూడా కారణం అవుతోంది. అలానే తాజాగా అఖిల్ సార్థక్ కూడా సోషల్ మీడియా నుండి బయటికి వెళ్లిపోతున్నట్లు పోస్ట్ పెట్టాడు. ఈ అపద్దపు ప్రపంచంలో నేను ఉండలేను వెళ్ళిపోతున్నా అంటూ పోస్ట్ పెట్టి మళ్ళీ వస్తా అంటూ పోస్ట్ లో చెప్పాడు. ఇక కెరీర్ పీక్స్ లో ఉండి మంచి ఆఫర్స్ అందుకుంటున్న వేళ అఖిల్ ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉండటం రిస్క్ అనే చెప్పాలి.
































