Akhil: అక్కినేని వారసుడు అఖిల్ ఇటీవల ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా అఖిల్ అభిమానులకు నిరాశ మిగిల్చింది. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేదు . మొదటి మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలువగా.. నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంతవరకు పర్వాలేదనిపించింది.
ఇక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన లేదంటే సినిమా తాజాగా విడుదల అయ్యి డిజాస్టర్ గా మిగిలి అందరి అంచనాలు తారుమారు చేసింది. దీంతో అఖిల్ తో నాగార్జున కూడా చాలా నిరాశపడ్డాడు. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా హిట్ అవ్వాలని ఇటీవల నాగార్జున అమల దంపతులు తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ కష్టపడి బాడీ బిల్డప్ చేసినప్పటికీ సినిమాలో స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోవడంతో సినిమా ప్లాప్ గానే మిగిలిపోయింది.
అఖిల్ మొదటి నుండి సినిమా సెలక్షన్ విషయంలో తప్పు మీద తప్పులు చేస్తూనే వస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అంటూ అక్కినేని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినప్పటికీ అతని వారసులు అఖిల్ నాగచైతన్య మాత్రం ఇప్పటికి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు వారి ప్రయత్నాలు మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి.
నాగచైతన్యకి అడపాదడపా హిట్లు పడినా కూడా అఖిల్ మాత్రం మొదటి నుండి ప్లాపులతోనే బండి లాగుతున్నాడు. దీంతో మీకు సినిమాలు సరిపడవు రిటైర్ అయిపోయి చక్కగా మీ తండ్రి వ్యాపారాలు చూసుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీ సినిమాలు చూస్తూ మాకు జండూబామ్ ఖర్చులు కూడా అధికమవుతున్నాయి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…