Akshy Kumar: అక్షయ్ కుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన హీరోగా ఒక సినిమాలో నటించారు అంటే ఆ సినిమా మినిమం గ్యారంటీ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉండేది.అయితే గత కొంతకాలంగా అక్షయ్ కుమార్ నటిస్తున్నటువంటి వరుస సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈయన క్రేజ్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది.

ఇలా అక్షయ్ కుమార్ తాజాగా సెల్ఫీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇందులో నటుడు అక్షయ్ కుమార్ కు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందించారని చెప్పాలి.ఇలా అక్షయ్ కుమార్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సెల్ఫీ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా మొదటి రోజు కేవలం రెండు కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టడంతో నేటిజన్స్ నటుడు అక్షయ్ కుమార్ పై తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.ఒక్క సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే అక్షయ్ కుమార్ సినిమా కేవలం రెండు కోట్లు సాధించడం ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు నటుడు అక్షయ్ కుమార్ ను ఏకంగా మగకంగనా అంటూ విమర్శలు చేస్తున్నారు.

Akshy Kumar: మగ కంగనా అంటూ ట్రోల్స్…
ఇక ఈయన నటి కంగనా రౌనత్ గత కొంతకాలంగా బిజెపికి మద్దతు తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయనని మగకంగనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సెల్ఫీ సినిమా డిజాస్టర్ కావడంతో అక్షయ్ కుమార్ వరుసగా బెల్ బాటమ్, బచ్చన్ పాండే, రక్షాబంధన్, పృథ్వీరాజ్, రామ్ సేతు వంటి డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొన్నారు.




























