Allu Aravind: ఆగిపోయిన హిందీ వెర్షన్ అలా వైకుంఠపురం.. ఈ విషయంలో విజయం సాధించిన అల్లు అరవింద్!
Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అల్లుఅరవింద్ తప్పకుండా అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ ప్రస్తుతం ఈ స్థాయిలో నిలబడ్డారు. ఇదిలా ఉండగా అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది.
ఇలా ఉన్నఫలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా బన్నీ క్రేజ్ పెరగడంతో బన్నీ తెలుగులో నటించిన సినిమాలు హిందీలో విడుదల కాబోతున్నాయి.ఈ క్రమంలోనే పుష్ప సినిమాని హిందీలో విడుదల చేసిన గోల్డ్ మైన్స్ సంస్థ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా హిందీలో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమయ్యింది.
ఈ క్రమంలోనే అలా వైకుంఠపురం సినిమా నుంచి జనవరి 26 వ తేదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు అయితే ఉన్నఫలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అందుకు గల కారణం ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ అలా వైకుంఠపురం సినిమా హిందీలో రీమేక్ చేయడం వల్ల ఆయన రంగంలోకి దిగి హిందీ వర్షన్ సినిమా విడుదలను ఆపినట్లు తెలుస్తోంది.
రోహిత్ దావన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా ఈ చిత్రాన్ని హిందీలో షేహజాదా పేరుతో ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్, అమన్ గిల్ లతో కలిసి అరవింద్ హిందీ రీమేక్ నిర్మాణంలోనూ భాగస్వాములయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా హిందీలో డబ్ అవుతూ విడుదలైతే హిందీ రీమేక్ సినిమాకు భారీ నష్టాలు వస్తాయి. అందుకే రంగంలోకి దిగిన అల్లు అరవింద్ మనీష్ షాతో ఆయన చర్చలు జరిపి అలా వైకుంఠపురం సినిమా డబ్బింగ్ వెర్షన్ విడుదలను ఉపసంహరించుకోవాలని చెప్పడంతో మనీష్ షా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అల్లు అరవింద్ తన బ్యానర్ జండా పాత బోతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…