Aleti Atom : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ జూన్ 17 నాడు కన్నుమూశారు. ఇక ఆయన గురించి ఆయన స్నేహితుడు ఏలేటి అటం మాట్లాడారు.

ఆయన కుటుంబం చేసిన తప్పు అదే…
ఏలేటి ఆటం రాకేష్ మాస్టర్ అనాధ ఆశ్రమములో ఉన్న సమయంలో పరిచయమైన వ్యక్తి. ఆశ్రమ నిర్వాహకుల్లో ఒకరైన ఏలేటి ఆటం గారు రాకేష్ మాస్టర్ మంచి మనిషి అంటూ దగ్గరగా ఉన్నవారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుందని చెప్పారు. ఆయనకు దేవుడు, దయ్యం వంటి నమ్మకాలు లేవని చెప్పారు.

ఆయన సంప్రదాయాలను నమ్మరని, ఏనాడు పూజలు అంటూ చేసింది లేదని చెప్పారు. ఆయన సమాధి ముందే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన చనిపోతే నాకు ఎలాంటి శాస్త్రాలు చేయొద్దని ముందే నాతో చెప్పాడు. కానీ వాళ్ళింట్లో వాళ్ళు అన్ని సంప్రదాయాలు చేసారు. ఆ సమయములో వారిని వద్దు అని చెప్పలేక పోయాము. ఆయన మీద హక్కు అందరికంటే ఎక్కువ ఆయన భార్య పిల్లలకే ఉంటుంది అందుకే వారు ఎలా చేయాలనుకుంటున్నారో ఆలా చేయానిచ్చాము అంటూ చెప్పారు.































