ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ఈరోజు (ఆదివారం) సాయంత్రానికి బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న తరుణంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున ఏపీలో వర్షాలు పడే సూచనలు అంతగా కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

అయితే దక్షిణ కోస్తా మరియూ రాయలసీమ ప్రాంతాలలో రానున్న రెండు రోజుల పాటు ఒకటి రెండు చోట్ల కాస్త తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంపై ఆదివారం నుంచి బ్రేక్ మాన్‌సూన్ ప్రభావం మొదలవుతుందని, దీని కారణంగా కోస్తా, రాయలసీమల్లో మెలమెల్లగా వర్షాలు కురుస్తూ ఈ నెల 23 నుంచి జోరందుకుంటాయని వివరించారు.



























