Alia Bhatt and Ranbir Kapoor : ప్రస్తుతం అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లు బ్రహ్మాస్త్రాలో కలిసి కనిపించనున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9, 2022న విడుదల కానుంది. కొన్నేళ్ల వీరి ప్రేమ బంధానికి స్వస్తి పలికి 2022 ఏప్రిల్ 14న వివాహం తో ఒక్కటైన సంగతి తెలిసిందే. కొంతమంది కుటుంబసభ్యులు సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇక అలియాభట్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో బాగా దగ్గరైంది. అలియాస్ రనబీర్ ల జంట మాత్రం చాలా క్యూట్ గా అభిమానులను ఆకట్టుకుంటుంది. వివాహ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్న ఈ జంట పెళ్ళైన 3 నెలలకే శుభవార్తని కూడా అభిమానులకు చెప్పేసారు.

తల్లి కాబోతున్న ఆలియా…
అలియా భట్ మరియు రణబీర్ కపూర్ సోమవారం ఉదయం తమ జీవితం లోని శుభవార్తను ప్రకటించినందున అభిమానులకు తీపి ఆశ్చర్యం కలిగించింది. ఆలియా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. శుభవార్తను తెలిపిన కొన్ని క్షణాలలోనే ఇది వైరల్ గా మారింది. చెకప్ చేయించుకున్న తరువాత హాస్పిటల్ నుంచే శుభవార్తను తెలియజేసింది.
హాస్పిటల్ లో సోనోగ్రఫీ చేయించుకునేటప్పడు ఫోటో కూడా షేర్ చేస్తూ అభిమానులను అశ్చర్యపరిచింది. ఈ ఫొటోలో ఆలియా పక్కన రనబీర్ కూడా వున్నారు. ఈ ఫోటోతో పాటు వెంటనే ఆడ సింహం, మగ సింహం, తమ బేబీ సింహం తో వున్న ఫోటో కూడా షేర్ చేసింది. ఆలియా ఈ శుభవార్త చెప్పగానే సెలబ్రిటీలు అందరు ఆలియా రనబీర్ జంటకు శుభాకంక్షాలు తెలియజేసారు. ప్రియాంక చోప్రా, రకుల్ ప్రీతీ సింగ్, కరణ్ జోహార్, టైగర్ ష్రాఫ్, మౌని రాయ్, డయానా పేంటీ వంటివారు ఈ జంటకు అభినందనలు చెప్పారు.































