Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇటు సౌత్ లో కూడా ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. ఎంతో కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఇటీవల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలో కి అడుగుపెట్టారు.
వివాహం జరిగిన కొంత కాలానికి తల్లి కాబోతున్నట్లు ఆలియా ప్రకటించింది. ఇక ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా తన కూతురి కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కూతురి బాగోగులు చూసుకుంటూ ఇంటిపట్టునే కాలం గడుపుతోంది. అయితే అప్పుడప్పుడు మీడియా ముందు మెరుస్తున్న ఈ బ్యూటీ తాజాగా అమెరికాలో జరిగిన ఫ్యాషన్ ఫెస్టివల్ మెట్ గాలాలో సందడి చేసింది.
అలియాభట్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించింది. 6 నెలల క్రితం తల్లి అయిన అలియా ఈవేడుకలలో చాలా ఫిట్‌గా, హాట్ గ్లామర్ లుక్‌తో సందడి చేస్తూ అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. ఇక ఈ ఫ్యాషన్ ఫెస్టివల్ లో అందరి చూపు ఆమె డ్రెస్‌పైనే పడింది. ఈ ఫెస్టివల్ లో ఆలియా ముత్యాల గౌనులో దేవతలా మంత్రముగ్ధులను చేసింది. అయితే మెట్ గాలా ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లిన ఆలియా తన గారాలపట్టి చిన్నారి కూతుర్ని బాగా మిస్ అవుతోంది. ఈ ఈవెంట్ కోసం ఆలియా తన కూతురికి నాలుగు రోజుల పాటు దూరంగా ఉంది.
ఈ క్రమంలో కూతురిని బాగా మిస్ అవుతున్నానంటూ ఆలియా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో మెట్ గాలా వేడుకకు రెడీ అవుతున్న సమయంలో తన కూతురు రాహా గురించి మాట్లాడుతూ…పాప పుట్టిన ఈ ఆరు నెలల కాలంలో నేను నా బిడ్డను 24గంటల కంటే ఎక్కువ సమయం విడిచి ఉండలేదని ..ఇప్పుడు ఉండాల్సి వచ్చిందని అలియాభట్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కూతురు మీద ఆలియాకి ఉన్న ప్రేమ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…