Alia Bhatt: బాలీవుడ్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అలియాభట్ తెలుగు ప్రేక్షకుల ముందుకు RRR సినిమా ద్వారా వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈమెకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇలా తెలుగు బాలీవుడ్ హాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్లో ఎంతో బిజీగా గడుపుతున్న అలియా సహనటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉండి గత ఏడాది ఏప్రిల్ 14 వ తేదీ పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి జరిగిన ఏడు నెలలకే ఈమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో అలియా భట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ ఈమెను భారీగా ట్రోల్ చేశారు.అయితే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె ఈ విషయం గురించి స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టారు.తనకు హాలీవుడ్ సినిమా అవకాశం వచ్చినప్పటికీ తాను ప్రెగ్నెంట్ అని అయితే అప్పటికి ఇంకా తనకు పెళ్లి కాలేదని తెలిపారు. ఇక హాలీవుడ్ యాక్షన్స్ సన్ని వేషాలలో పాల్గొనే సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని అయితే చిత్ర బృందానికి తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియచేయడంతో వారు తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపారు.
ఇక ఈమె హాలీవుడ్ సినిమాకు కమిట్ అవడంతో తన బేబీ బంప్ తోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.మొత్తానికి ఆలియా భట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయం తెలియచేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నేటిజన్స్ చాలా ఆశ్చర్యకరంగా భావిస్తున్నప్పటికీ కపూర్ ఫ్యామిలీ, అలియా ఫ్యామిలీ ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా అలియా తన ప్రెగ్నెన్సీ గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…