Aliya Bhatt: బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా రణబీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలాకాలం డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ గతేడా అది పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వివాహమైన కొంతకాలానికి తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుభవార్త తెలియజేశారు. ఇక ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
కూతురు పుట్టిన తర్వాత ఆలియా రణబీర్ దంపతులు ఎక్కువ సమయం తమ కూతురితో గడపటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆలియా కూతురి కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చి కూతురి బాగోగులు చూసుకుంటుంది. ఇక రణబీర్ కూడా షూటింగ్ కి బ్రేక్ దొరికినప్పుడల్లా కూతురితో కలిసి కబుర్లు చెప్పుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రణబీర్ కపూర్ చాలా సెన్సిటివ్ అని కూతురు పుట్టాక అది మరింత పెరిగిందని ఆలియా ఆసక్తికర విషయాలు తెలిపింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా మాట్లాడుతూ..”రణబీర్ నేను ముద్దుగా మా పాపని చీతా అని పిలుచుకుంటాము. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత అలసటగా ఉన్న తన ముఖం చూడగానే అంతా మరిచిపోతాము. తనని దగ్గరికి తీసుకొని హత్తుకోవడం కన్నా మరేదీ ముఖ్యం కాదని అనిపిస్తుంది అంటూ ఆలియా తెలిపింది.రణబీర్ చాలా సెన్సిటివ్. కూతురు పుట్టాక మరింత సెన్సిటివ్ అయ్యాడు.
రణబీర్ కూతురిని భుజాల మీద ఎక్కించుకొని ఆడిస్తుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. కూతురితో కలిసి కిటికీ పక్కన కూర్చుని టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. రణబీర్ ఉంటే తను నా దగ్గరికి కూడా రాదు. తను పనిమీద ఎటైనా వెళ్ళినప్పుడు కూతురు తనను మర్చిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. అందువల్ల రణబీర్ స్థానంలో నేను కిటికీ పక్కన కూర్చుని రాహాకి కబుర్లు చెబుతూ ఉంటాను” అంటూ ఆలియా చెప్పుకొచ్చింది
మైత్రీవనం లోని నీలగిరి బ్లాక్ భవనంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు…
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ముఖంపై మొటిమలు ఒకటి. ప్రత్యేకంగా యువతలో ఇది ఎక్కువగా…
భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందారు. విదేశీ…
తెలుగు డిజిటల్ మీడియాలో సంచలనం రేపుతున్న ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ అలియాస్ “నా అన్వేషణ” మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ…
తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…
అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…