Hero Yash: ఆ సినిమా క్రెడిట్ అంతా నాది కాదు… ఈ అద్భుతాన్ని సృష్టించిన తనకే దక్కాలి…యశ్ షాకింగ్ కామెంట్స్?
Hero Yash: కేజిఎఫ్ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్,హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇలా ఈ సినిమా విజయవంతం కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాని వచ్చేనెల 14వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో యష్ పలు షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఇక ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. ఈ సినిమా 8 ఏళ్ల కష్టం. లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి ఒక్కరు చెమట చిందిస్తూ ఈ సినిమా కోసం పనిచేశారు. ఈ సినిమా కోసం అంతగా కష్టపడిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలా తెరవెనక ఇంత కష్టపడి తెరపై నన్ను చూసి చాలామంది ఈ సినిమా క్రెడిట్ మొత్తం నాకే ఇస్తున్నారు… నిజానికి ఈ క్రెడిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కే చెందాలి అంటూ యష్ కామెంట్ చేశారు. ప్రస్తుతం యశ్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…