Allari Naresh : ఈవివి సత్యనారాయణ గారి వారసుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. తన మొదటి సినిమా అల్లరి కావడంతో తన పేరు అల్లరి నరేష్ గా మారిపోయింది. హాస్య ప్రధానమైన పాత్రలే కాకుండా నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు అయిన ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో, నేను వంటి సినిమాలలో నటించి అందరినీ మెప్పించారు. ఈతరం రాజేంద్రప్రసాద్ అనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఈవివి సత్యనారాయణ గారు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఈవివి బ్యానర్ స్థాపించి చాలా సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. కాకపోతే అయన మరణించాక అల్లరి నరేష్ ఆ బ్యానర్ లో సినిమాలు నిర్మించాలని భావించారు.
ఈసారి నిర్మాణ బాధ్యతలు ఆర్యన్ రాజేష్ కి…
అప్పట్లో ఫ్లాపుల్లో పడి సతమతమవుతున్న ఈవీవీ కి తన సొంత బ్యానర్ ద్వారానే మళ్లీ విజయం వచ్చింది. ఈవీవీ చనిపోయాక ఆ బ్యానర్ పేరు మీద మళ్ళీ మంచి సినిమాల్ని తీయాలని నరేష్ భావించి, బందిపోటు సినిమా నిర్మించాడు. అయితే ‘బందిపోటు’ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాతో నరేష్ చాలా నష్టపోయాడు అంతేకాకుండా ఇక నిర్మాణం గురించి కూడా ఆలోచించలేదు. దాని గురించి ఎవరైనా ప్రస్తావించినా ఇప్పట్లో లేదు అని మొహం మీదనే చెప్పేవాడు. అయితే ఇపుడు తాజాగా మళ్ళీ సినిమాలు నిర్మించాలనే ఆలోచన వచ్చిందట.
ఇపుడు ఓటీటీ అనే మరో వేదిక ఉంది కాబట్టి అల్లరి నరేష్ ఈ సారి సినిమాలు నిర్మించాలని భావిస్తున్నారట. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా నిర్మించాలని చూస్తున్నారట. అయితే ఈసారి మాత్రం నిర్మాణ భాద్యతలు అన్నీ వాళ్ళ అన్న ఆర్యన్ రాజేష్ కు అప్పగించాలని అనుకున్నట్టు సమాచారం. నాంది సినిమాతో మళ్ళీ హిట్ కొట్టినట్టు సినిమా నిర్మాణం విషయం కూడా కలసి వస్తుందేమో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…