Allari Naresh : డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన అల్లరి నరేష్ మొదటి సినిమా ‘అల్లరి’ తో మంచి సక్సెస్ అందుకుని ఆ తరువాత అల్లరిని తన ఇంటి పేరు గా మార్చుకున్నాడు. కామెడీ సినిమాలతో ఒక వెలుగు వెలిగిన నరేష్ ‘నేను, ప్రాణం’ సినిమాతో తనకు కామెడీనే కాదు నటనలోనూ సూపర్ అని నిరూపించుకున్నాడు. ఇక ‘గమ్యం’ వంటి సినిమాతో నటుడుగా మరో మెట్టు ఎక్కిన నరేష్ ‘సంఘర్షణ’ వంటి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక రవితేజతో కలిసి ‘శంభో శివ శంభో’ వంటి సినిమాలో అద్భుతంగా నటించాడు.

చెట్టా పట్టాలేసుకుని తిరిగి హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్…
సినిమాల్లో బాగా కామెడీ చేసే నరేష్, రియల్ లైఫ్ లో మాత్రం బాగా సీరియస్, కామ్ గా తన పని తాను చూసుకుని పోయే రకం. అలాంటి అల్లరి నరేష్ కెరీర్ మొదట్లో తనతో నటించిన ఒక హీరోయిన్ ను బాగా లవ్ చేసాడట. చాలా రోజులు చెట్టా పట్టాలెసుకుని తిరిగారట. అయితే నరేష్ పెళ్లి మాట ఎత్తే సరికి అమ్మడు కామెడీ ఫెల్లో నీతో పెళ్లేంటి అని గుండె ముక్కలు చేసిందట.

ఆ తరువాత ఆ హీరోయిన్ ఒక తమిళ హీరోను ప్రేమ వివాహం చేసుకుని రీసెంట్ గా ఒక బిడ్డకు కూడా జన్మ నిచ్చిందట. పాపం నరేష్ చాలా సీరియస్ గా నిజాయితిగా ప్రేమిస్తే అమ్మడు బాగా తిరిగి టైం పాస్ చేసి చివరికి హ్యాండ్ ఇచ్చిందట. ఈ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం అల్లరి నరేష్ ‘మారేడుపల్లి ప్రజానీకం’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు నరేష్.



























