Allegations on BRS MLA Durgam Chinnayya : తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద శీజేల్ అనే యువతి తనను లైంగికంగా వేధించాడు, అమ్మాయిలను పంపించాలని టార్చర్ చేసాడు, ఏ తప్పు చేయకపోయినా పోలీస్ కేసులు పెట్టి వేదిస్తున్నాడంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియా ద్వారా సెల్ఫీ వీడియో పెట్టి సంచలనం రేపింది. బిజినెస్ పనుల కోసం వెళితే మధ్యం సేవించాలని ఒత్తిడి చేసాడు అంటూ ఆధారాలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది శీజేల్. ప్రస్తుతం ఈ న్యూస్ ఏపీ తెలంగాణ రాజకీయాల్లో వైరల్ గా మారింది.

తాను చెప్పిన పనులు చేయలేదని పోలీస్ కేసులు పెట్టాడు…
అనంతపురంకి చెందిన శీజేల్ అనే యువతి హార్టికల్చర్ లో డిగ్రీ చదివి తండ్రి దగ్గర 20 లక్షలు తీసుకుని ఆరిజిన్ అనే కంపెనీ లో పెట్టుబడులను పెట్టింది. ఆ స్టార్టప్ కంపెనీలో రైతుల వద్ద కొంత పెర్సెంటేజీ డబ్బు తసుకుని పశువులను వారికి ఇచ్చి పాలను తిరిగి ఆ కంపెనీకే పోసేలాగా ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తారు. పశువులకు ఏ జబ్బు వచ్చినా కంపనీనే బాధ్యత తీసుకుంటుంది అంటూ శీజేల్ చెబుతున్నారు. ఆదినారాయణ అనే వ్యక్తి ద్వారా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన శీజేల్ కు ఈ కంపనీలో మరికొంతంది పెట్టుబడులు పెట్టగా మంచిర్యాల కు సంబంధించిన కొంతమంది పెట్టుబడులు పెట్టారని అలా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమ కంపెనీలో ఆయన బంధువును చేర్చుకోవాలని చెప్పి రెండు ఎకరాల భూమి కూడా ప్లాంట్ కోసం ఇచ్చారట.

అప్పుడప్పుడు బిజినెస్ నిమిత్తం ఎమ్మెల్యే ను కలుస్తుండగా ఒకరోజు దళిత బంధు గురించి మాట్లాడాలి రమ్మని పిలిచి మద్యం తాగమని ఒత్తిడి చేసారు నేను తాగలేదు అంటూ శీజేల్ తెలిపారు. ఇక మరోసారి కాల్ చేసి తమ కంపనీలో పనిచేసే ఒక అమ్మాయిని రాత్రికి పంపాలని అడుగగా అలాంటి పనులు చేయమని చెప్పినా విసింగించేసరికి అలాంటి పనులు చేసే ఒక బ్రోకర్ నెంబర్ ను ఆయనకు ఇచ్చామని, పార్టనర్ గా తమ వ్యక్తిని పెట్టుకోమని ఐదలక్షలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని డబ్బులు మావే తీసుకుని చివరకు మామీద కేసులు పెట్టారని తెలిపారు శీజేల్. అయితే ఇందులో ఎమ్మెల్యే వాదన మరోలా ఉండటం విశేషం. ఆయన క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేసారు, ప్రత్యర్థుల కుట్రగా తెల్చేశారు.