Allu Aravindh : మెగా-అల్లు కుటుంబాల మధ్య ముందు నుండి మంచి అనుబంధం ఉందని అందరికీ తెలుసు. ఇక చిరంజీవి గారు అల్లుడు అల్లు అర్జున్ ని కుడా కొడుకు రామ్ చరణ్ తో సమానంగా ప్రమోట్ చేసారు. సినిమాల్లోకి మెగా హీరోగానే బన్నీ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని బయటకు వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం మీద ఇరు కుటుంబాల నుండి ఎవరూ క్లారిటీ ఇవ్వకపోయినా ఎవరికి వాళ్ళు గ్యాప్ వచ్చింది అంటూ కథనాలు అల్లేస్తున్నారు.

ఆలి తో సరదాగా లో అల్లు అరవింద్ కి ఎదురైన ప్రశ్న…
అల్లు రామలింగయ్య గారి శత దినోత్సవ వేడుకల్లో కూడా వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అన్న అనుమానం కలిగేలా మాట్లాడారు. ఇక తాజాగా అల్లు అరవింద్ గారు ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో కి వచ్చారు. ఇక షో లో అందరూ అనుకున్నట్లే ఆలీ నుండి అరవింద్ గారికి ఈ ఇష్యూ మీద ప్రశ్న ఎదురైంది. కాంట్రవర్సీ ప్రశ్నలు అడగనని చెప్పి ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని అరవింద్ గారు సీరియస్ అయినట్లు మనకు ప్రోమోలో చూపించారు.
ఆలీ, అల్లు అరవింద్ గారిని అల్లు, మెగా ఫ్యామిలీ విషయంలో ఏమైనా గ్యాప్ వచ్చిందా అని అడగడంతో ఆయన సీరియస్ అయినట్లు చూపిస్తారు. కాంట్రావెర్సీ ప్రశ్నలు అడగడం లేదు కేవలం సర్ప్రైజింగ్ ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నా అంటూ ఆలీ అనడం ఇక అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. అయితే ఆ ప్రశ్నకు అరవింద్ సమాధానం చెప్పారో లేదో మాత్రం సోమవారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


































