Allu Arjun: సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్నదో మనకు తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా అల్లు అర్జున్ కు ఎంతో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇకపోతే తాజాగా భారత ప్రభుత్వం 69వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ జాతీయ అవార్డుల జాబితాలో భాగంగా తెలుగు సినిమాలు సత్తా చాటుకున్నాయి. పుష్ప సినిమా ఏకంగా ఆరు విభాగాలలో జాతీయ అవార్డులను అందుకోవడం విశేషం అదేవిధంగా ఉత్తమ జాతీయ చిత్రంగా ఉప్పెన సినిమా అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఉత్తమ జాతీయ నటుడుగా అల్లు అర్జున్ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.
ఈ విధంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకోవడంతో అల్లు కాంపౌండ్ లో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ ఇంటికి పుష్ప కుటుంబ సభ్యులందరూ చేరుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ ఈ సందర్భంగా కాస్త ఎమోషనల్ అయ్యారు.
అల్లు అర్జున్ ఇంటికి చిత్ర బృందం చేరుకోవడంతో పెద్ద ఎత్తున సంతోషం వెల్లు విరిసింది. ఈ క్రమంలోనే సుకుమార్ బన్నీని కౌగిలించుకొని సంతోషంలో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా చిత్ర బృందం మొత్తం అల్లు అర్జున్ ఇంట్లో చేసుకున్నటువంటి సంబరాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…