గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది..ఈ క్రమంలో షూటింగ్‌లలో పాల్గొంటున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి కోలుకున్నారు.అటు మెగా ఫ్యామిలీ అల్లుడు కళ్యాణ్ దేవ్ కోవిడ్ బారిన పడ్డారు. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారు. అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.
నిన్న మొన్నటి వరకు ఈయన పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా పుష్ప సినిమా కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు అంటూ ఇటీవలే మనం చెప్పుకున్నాం. షూటింగ్ లో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది చొచ్చుకుని పుష్పను చేరింది. పుష్ప యూనిట్ లో పలువురు ఇప్పుడు కరోనా తో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ అనే విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే బన్నీ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.వారం రోజుల్లోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగా కాంపౌండ్ వర్గాల వారు అంటున్నారు. పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్న వారు అంతా కూడా ఇప్పుడు సెల్ప్ క్వారెంటైన్ కు వెళ్లి పోయారు. ఇక అల్లు అర్జున్ ఇంట్లోనే క్వాటైన్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
బన్నీ పిల్లలు మరియు భార్య కూడా పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. వారి రిపోర్ట్ నెగటివ్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు..ఇక ప్రస్తుతం బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..ఇటీవలే బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ టీజర్ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా పుష్ప ఇంట్రో టీజర్ రికార్డుకెక్కింది..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…