తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు కరోనా కారణం చేత వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటం చేత సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోని జనవరి నెలలో RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య వంటి చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధం అయింది.
ఈ క్రమంలోనే డిసెంబర్ 25వ తేదీ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ముందుగా చిత్రబృందం వెల్లడించినప్పటికీ పలు కారణాల వల్ల ఈ చిత్రాన్ని డిసెంబర్ 17వ తేదీకి మార్చుకున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎలాంటి సినిమాలు విడుదల లేకపోవడంతో డిసెంబర్ 24వ తేదీ నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.
అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా 17వ తేదీ కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం 25 వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇదే కనుక జరిగితే పూర్తిగా అల్లు అర్జున్ పుష్ప సినిమా నాని సినిమాను చిక్కుల్లో పడేసినట్టు అవుతుంది.
ఇక డిసెంబర్ 24వ తేదీ నాని సినిమా విడుదల కాకపోతే మరో రెండు నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జనవరి నెలలో స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా చిత్రాలు వరుసగా విడుదల కావడంతో ఖచ్చితంగా మరో రెండు నెలల వరకు నాని తన సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ పుష్ప సినిమా 25వ తేదీ కూడావిడుదల కాలేకపోతే నాని సినిమా యధా విధిగా విడుదలవుతుంది లేదంటే మరోసారి నాని తన సినిమాను వాయిదా వేసుకుంటాడా లేదంటే అల్లు అర్జున్ ను ఢీ కొడతాడా తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…