Allu Arjun reveals about crush before marriage: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ కాంపౌండ్ నుండి వచ్చిన చాలా త్వరగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఎనర్జెటిక్ డాన్స్ తో స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో స్టైలిష్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్నాడు బన్నీ. గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన బన్నీ ఆర్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత మంచి హిట్స్ అందుకుంటూ కమర్షియల్ హీరో గా ఎదిగి ఇపుడు టాప్ తెలుగు హీరోస్ లో ఒకడిగా ఉన్నాడు . ఇక ఆర్య నుండే బన్నీకి మలయాళం లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఎపుడు రీసెంట్ గా విడుదలైన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

నిజానికి బన్నీ సినిమాలను హిందీలో డబ్ చేయడం వల్ల ఉత్తరాదిలో బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. హిందీలో బడా ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ ఏకంగా అల్లుఅర్జున్ ను శాటి లైట్ స్టార్ అంటూ బిరుదు ఇచ్చేసాడు. ఇక బన్నీ సినిమాలకు ఎంత శ్రద్ద పెడతాడో కుటుంబానికి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తాడు తెరాస నేత ప్రభాకర్ రెడ్డి కూతురు స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ పెళ్ళికి ముందు కూడా ఎటువంటి రూమర్స్ దాఖలాలు లేవు.

విశ్వ సుందరిని ప్రేమించిన బన్నీ…..
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బన్నీ ఒక హీరోయిన్ పై ఉన్నా క్రష్ గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. బన్నీ కి విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టమట. తనను చాలా ప్రేమించాడట. ఇక ఐశ్వర్య, అభిషేక్ వివాహం జరిగినపుడు చాలా బాధపడ్డాడట బన్నీ. ఇపుడు ఈ విషయం బాగా వైరల్ అయింది. ఇక బన్నీ పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. పుష్ప పార్ట్ 1 భారీ హిట్ అవ్వడంతో పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.



























