#AlluArjunInNalgonda : నల్గొండ జిల్లాలో సందడి చేసిన సినీ హీరో అల్లు అర్జున్

0
98

#AlluArjunInNalgonda : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం, బట్టు గూడెం గ్రామంలో బీఆర్ఎస్ స్టేట్ లీడర్, అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తన సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన పార్టీ కార్యాలయం, ఫంక్షన్ హాల్ ను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ క్షేత్రం వద్ద చంద్రశేఖర్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. 10 వేల మందికి భోజన ఏర్పాట్లతో పాటు, మహిళలకు చీరల పంపిణీ చేయనున్నారు. బన్నీ రాకతో సాగర్ రాజకీయంలో రసవత్తర చర్చ జరుగుతుంది.

ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో సందడి నెలకొంది. అల్లు అర్జున్ ఫాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చారు. నల్గొండలో బైక్ ర్యాలీకి వందలాది మంది మద్దతుదారులు తరలివచ్చారు. వేలాది మంది అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికి పెద్ద పూలమాల వేసి సత్కరించారు. ఈ క్రమంలో అభిమానుల ఆదరణకు, ప్రేమకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. వర్క్ ఫ్రంట్‌లో, అల్లు అర్జున్ “పుష్ప 2” సెట్స్‌పై ఉంది. ఈ సినిమా నిర్మాణం ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది.