Amigos Twitter Review : నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ ప్రతిసారి డిఫరెంట్ కథలతో సినిమాలను తీస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ‘బింబసార’ సినిమాతో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో హిట్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి ‘అమిగోస్’ అంటూ ప్రేక్షకులకు ముందుకు వచ్చేసాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అమిగోస్ లో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో కనిపించాడు. ఇక కళ్యాణ్ రామ్ కి జంటగా ఆశిక రంగనాధ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10 న థియేటర్లలో సందడి చేయగా మొదటి బొమ్మ పడిపోవడంతో ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్స్ సినిమా ఎలా ఉందో చెప్పేసారు.

మిశ్రమ స్పందనతో అమిగోస్…
అమిగోస్ సినిమా మొదటి హాఫ్ స్లోగా వెళ్తోందని, అయితే ఇంట్రెవెల్ ట్విస్ట్ బాగుంటుంది, ఇక సెకండ్ హాఫ్ ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటుందంటూ ఓవరాల్ గా సినిమా పర్వాలేదని ఒక నెటిజెన్ అభిప్రాయపడగా మరో నెటిజెన్ సినిమాలో పాత్రల ఎంపిక బాగుందని, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుందంటూ చెప్పి సినిమాలో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ బాగా చూపించారు అంటూ సినిమా ఫ్రెండ్స్ తో చూడటానికి బాగుందని చెప్పాడు.

#Amigos
— tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) February 10, 2023
1st half: characters building sequences????????, interval ????????
Average 1st half
2nd half: Good Racy screenplay in parts????????,Action scenes,Climax????????
Good 2nd half
Overall: Good???????? 3/5@NANDAMURIKALYAN Hit streak continues????????????#AmigosOnFeb10th #Amigosreview #kalyanRam
Just watched #Amigos and it's a feel-good film with laughter, friendship, and heartwarming moments! The cast is fantastic and their chemistry shines on screen. Highly recommend for a movie night with your own amigos ????????#AmigosReview #MovieReview #FriendshipGoals #eshwarweb pic.twitter.com/5jhpPvtLPk
— Eshwar Web (@EshwarWeb) February 10, 2023
#Amigos A Subpar Drama/Thriller that had an interesting concept with substandard execution!
— Venky Reviews (@venkyreviews) February 10, 2023
The movie had a unique concept and a few moments/twists that were executed well. However, the overall narration is sluggish and does not excite for the most part.
Rating: 2.25-2.5/5
మరో నెటిజెన్ కూడా సినిమా సెకండ్ హాఫ్ చాలా బాగుందని కొన్ని ట్విస్ట్లు బాగున్నాయంటూ చెప్పాడు. అయితే సినిమా కథ బాగున్నా నాసిరకం కథనంతో యావరేజ్ సినిమాగా చెప్పొచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. మైత్రి మూవీ మేకర్స్ పథాకం పై యార్నేని నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మిక్సడ్ టాక్ తో జనాలను ఆకట్టుకుంటోందనే చెప్పాలి.































