Featured

బిగ్ బి అమితాబ్ వల్లే బాలకృష్ణ సినిమా ఆగిపోయిందా..?

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కొన్ని పాత్రలను కథ రాసుకున్నప్పుడు ఎవరైతే మైండ్ లో వస్తారో వారు తప్ప మరొకరితో ఆ పాత్ర చేయాలంటే దర్శక, రచయితలకి అంతగా ఇష్టముండదు. ఎంత ఆలస్యం అయినా కథ, అందులోని పాత్రకి తగ్గ నటీ నటులు కుదిరినప్పుడే దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది. ఎవరైనా ఓ పాత్ర చేసే సత్తా ఉన్నప్పటికి కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఎవరు చేస్తే ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందో అలాంటి వారే చేయాలి. లేదంటే కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాపయిన సందర్భాలున్నాయి.

ఉదాహరణకి పూరి జగన్నాథ్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా. ఇందులో ఎన్.టి.ఆర్ తండ్రీ కొడుకులుగా నటించాడు. సినిమాకి ఇదే పెద్ద మైనస్ అయింది. అంత చిన్న ఏజ్‌లో తారక్‌ను తండ్రీ కొడుకులుగా అంటే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తండ్రి పాత్రలో తారక్ తండ్రి హరికృష్ణ గనక చేసుంటే కొద్దిలో కొద్దిగా ఆంధ్రావాలా సినిమా ఓ మాదిరి సక్సెస్ అయినా సాధించి ఉండేది. ఇక బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలలోని పాత్రలు ప్రకాశ్ రాజ్ తప్ప ఇంకెవరీనీ ఊహించలేము. వై.ఎస్స్ఆర్ యాత్ర సినిమాలో కూడా రాజశేఖర్ రెడ్డిగా మమ్మూట్టి పర్‌ఫెక్ట్ ఛాయిస్.

ఆయన డేట్స్ కావాలంటే 6 నెలలు ఆగాల్సి వస్తుందని అప్పటి వరకు మీకు ఇబ్బంది లేకపోతే నేను ఈ సినిమా చేస్తాను. లేదంటే మీరు ఇంకో నటుడితో చేసుకోవచ్చని మమ్ముట్టి ఓపెన్‌గా చెప్పారు. అయినా దర్శకుడు మహి వి రాఘవకి మమ్ముట్టితోనే యాత్ర సినిమా చేయాలనుకున్నారు. ఆయన ఫ్రీ అయ్యాకే సినిమా చేశారు. కంప్లీట్ బయోపిక్ కథ తప్ప కమర్షియల్ అంశాలు లేకపోవడం కొంత యాత్ర సినిమాకి మైనస్ అయింది గానీ లేదంటే ఇంకా పెద్ద సక్సెస్ సాధించేది.

అయితే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో  రైతు అనే సినిమా తెరకెక్కాల్సింది. ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాలని కృష్ణవంశీ అనుకున్నారు. బాలయ్యకి కథ కూడా చెప్పాడని, ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇదే బాలయ్య 100 వ సినిమా అని కూడా చెప్పుకున్నారు. కానీ కృష్ణవంశీ – బాలయ్య కాంబినేషన్‌లో రావాల్సిన రైతు సినిమా అటకెక్కింది. 100 వ సినిమాగా వస్తుందనుకున్న రైతు సినిమాకి బదులుగా క్రిష్ దర్శకత్వంలో గౌతమీ పుత్ర శాతకర్ణి వచ్చి భారీ హిట్ అందుకుంది.

అయితే ఎన్‌బికె 101, 102, 103, 104..ఇలా ప్రతిసారి నెక్స్ట్ సినిమా రైతు అని అనుకుంటున్నారు గానీ అభిమానులకి నిరాశ తప్ప వేరే ఏమీ మిగలడం లేదు. ఈ సినిమా మొదలవకపోవడానికి కారణం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అని చెప్పుకుంటున్నారు. ఇందులో ఉన్న ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ తప్ప మరో నటుడు వద్దని దర్శకుడు కృష్ణవంశీ పట్టుదలగా ఉన్నాడట. ఆయన చేయకపోతే ఈ ప్రాజెక్ట్ ఉండదని కూడా తెలుస్తోంది. లేదంటే ఇప్పుడు చేస్తున్న రంగ మార్తాండ, ఆ తర్వాత ప్రకటించిన అన్నం అనే సినిమాలకి బదులుగా రైతు సినిమాను తెరకెక్కంచేవారు. మరి కృష్ణవంశీ ఈ సినిమాకి అమితాబ్ తప్ప మరో ఆప్షన్ ఎందుకు ఆలోచించడం ఎవరీకీ అర్థం కావడం లేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

21 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

21 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago