Amma Rajashekhar : డాన్స్ మాస్టర్ గా సినిమాల్లో సక్సెస్ అయి సినిమా దర్శకులు గా మారిన వారిలో అమ్మ రాజశేఖర్ ఒకరు. తెలుగులో గోపీచంద్ తో తీసిన ‘రణం’ సినిమా ద్వారా డైరెక్టర్ గా మంచి హిట్ అందుకున్న అమ్మ రాజశేఖర్ ఆ తరువాత వరుస ఫ్లాప్ లను చవిచూసి డైరెక్టర్ గా కెరీర్ డౌన్ కి వెళ్ళిపోయింది. ఆర్థికంగా కూడా నష్టాలను చూసిన అమ్మ రాజశేఖర్ తనను సినిమాల్లో చాలా మంది మోసం చేసారంటూ చెప్పాడు.

జేడీ చక్రవర్తి అలా అంతా మార్చేశాడు…
తన గురువుగా భావించే జేడీ చక్రవర్తి మోసం చేసాడని ఆరోపించాడు. ప్రొడ్యూసర్ గా సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ నష్టపోతున్నపుడు మళ్ళీ డైరెక్షన్ వైపు వెళ్ళాను. ఒక కథ అనుకున్నాక జేడీ చక్రవర్తికి కథ వినిపించగా ఓకే అన్నాడు. ఇక ప్రొడ్యూసర్ కూడా కుదిరాక షూటింగ్ అంతా పూర్తయింది. ఇక సినిమాకు ‘ఉగ్రం’ అనే పేరు అనుకున్నాం. అయితే ప్రొడ్యూసర్ పక్కన ఉండే కాశి అనే వ్యక్తి జేడీ చక్రవర్తి అభిమాని అంటూ బాగా సోప్ వేసే వాడు. నేను చూసి పెద్దగా పట్టించుకోలేదు.

పచ్చబొట్టు వేయించుకున్నా అంటూ చూపించాడు కూడా. ఇక సినిమా అంతా పూర్తయ్యాక ప్రొడ్యూసర్ నక్షత్రకి కూడా అలానే మాటలు చెప్పి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక మళ్ళీ సినిమాలో ఎడిటింగ్ చేసి మళ్ళీ రీ రికార్డింగ్ చేసారు. హిందీ లో అరవై లక్షలకు సినిమా అమ్మేసిన తరువాత, ఇక టైటిల్ తో సహా అంతా మార్చారు, నాకు తెలియకుండా ఇదంతా చేసారు. మూడు నెలల్లో పూర్తి అయిన సినిమాను మూడు సంవత్సరాలు చేసి సినిమాను నాశనం చేసారు. ఇక సినిమాకు నా షేర్ నాకు ఇవ్వలేదు. కనీసం ఒక పది లక్షలు ఇవ్వమన్నా ఇవ్వలేదు. మా అమ్మ కి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఉన్నపుడు డబ్బు అడిగినా ఇవ్వలేదు. నా గురువు కాబట్టి జేడీ చక్రవర్తి ని వదిలేసాను ఈ విషయంలో లేకపోతే గొడవ జరిగేది.