Amma Rajashekhar : డాన్స్ మాస్టర్ నుండి దర్శకుడిగా మారిన వ్యక్తి అమ్మ రాజశేఖర్. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు ఉన్న అమ్మ రాజశేఖర్ ఆ తరువాత దర్శకుడిగా మారాడు. తమిళ సినిమాలతో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడు. ఇక తెలుగులో గోపీచంద్ హీరోగా ‘రణం’ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ తరువాత రవితేజ తో కలిసి ‘ఖతర్నాక్’ అనే సినిమా చేసాడు. ఇలియానా రవితేజ జంటగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఖతర్నాక్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అదే…
సినిమా షూటింగ్ సమయంలో ఒకవైపు నేను షూటింగ్ పార్ట్ చేస్తుంటే విడుదల తేదీ దగ్గర వస్తోందని అసిస్టెంట్ డైరెక్టర్లు ఎడిట్ చేశారు. నా చేత్తో ఫైనాన్స్ లేదు కాబట్టి సినిమా నా కంట్రోల్ లో లేకుండా పోయింది. ఎడిటింగ్ సరిగా చేయలేదు. ఇక ఇంటర్వెల్ సన్నివేశాలను, ఎండింగ్ లో క్లైమాక్స్ ను సరిగా ట్రిమ్ చేయలేదు. నేను చేస్తానని చివర్లో చెప్పినా అప్పుడే ఫస్ట్ కాపీ వెళ్ళిపోయింది అని చెప్పారు. సినిమా ఎడిటింగ్, ట్రిమ్ నీట్ గా చేసుంటే మంచి హిట్ అయ్యుండేది అంటూ చెప్పాడు. కో ఆర్డినేటర్ నన్ను మోసం చేశాడంటూ చెప్పాడు అమ్మ రాజశేఖర్.

ఆరోజు ట్రిమ్ చేయకుండా ఫస్ట్ కాపీ వెళ్లిపోయినపుడు ప్రసాద్ ల్యాబ్ లో ఏడుపు వచ్చిందని అక్కడే గడ్డిలో పడి దొర్లానని చెప్పాడు. ఇక ఆ తరువాత ఒక సినిమా కథ లైన్ గోపీచంద్ కి రణం సమయంలో చెప్పగా చాలా బాగుంది మనం చేద్దామని అడిగాడు కానీ కొద్దిరోజుల తరువాత చూస్తే తండ్రి కొడుకుల కథగా ‘శంఖం’ సినిమా వచ్చింది. అప్పుడు చాలా బాధగా అనిపించింది. నాకు ఇచ్చుంటే నేనే చేసుండేవాడిని కదా గోపి ఎందుకు ఇలా చేసాడు అనిపించింది. చాలా మంది నన్ను జీవితంలో మోసం చేసారు అంటూ అమ్మ రాజశేఖర్ చెప్పాడు.



























