ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో లీకుల బాధలు ఎక్కువయ్యాయి. గత నెల రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలు వరుసగా లీకుల బారిన పడుతున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా లీకు రాయుళ్లు ఎవరినీ వదలడం లేదు. ఇటీవల సర్కారు వారి పాట టీజర్ ముందుగానే లీక్ కావడంతో మేకర్స్ ఉన్నట్టుండి అర్ధరాత్రి బ్లాస్టర ను రిలీజ్ చేసేశారు. ఇలా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప సాంగ్ దాక్కో దాక్కో మేక తో పాటు భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా లీకై ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి.

రెండు సినిమాలనూ నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ పరిణామాలతో షాక్ కు గురైంది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా లీకు రాయుళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే అవేమి పని చేయలేదు. అంతకన్నా ముందు ప్రభాస్ షూటింగ్ సెట్లో ఉన్న వీడియో, అలాగే పవన్ భీమ్లా నాయక్ లో ఇద్దరు హీరోల మధ్య ఉండే ఓ ఆసక్తికరమైన సీన్ కూడా అలాగే బయటకు వచ్చేసింది.
తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నుంచి పోస్టర్ కూడా లీకైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాన్ పోలీస్ పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. రానా దీనిలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా ఓ పాటను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చెప్పే ఓ మాస్ డైలాగ్ కి సంబంధించిన చిన్న క్లిప్ బయటకి వచ్చిందని సమాచారం. ఇంతక ముందే.. ఈ పోస్టర్ లో పవన్, రానాను గట్టిగా పట్టుకున్నాడు. ఆ సీన్ ఫైటింగ్ సీన్ అయి ఉండవచ్చని తెలుస్తోంది.
#BheemlaNayak dialogue 30 sec leaked#PawanKalyan : aa rangaswamy raayavayya fir, statement, remand report padhi nimishallo veedi Balupu ento telustha ????
— Surya (@BheemlaNayak___) September 16, 2021
అయితే.. మరికొంత మంది మాత్రం ఇది ప్యాన్ మేడ్ పోస్టర్ అంటున్నారు. ఎందుకంటే అందులో రానా లుక్ నేనే రాజు నేనే మంత్రి ని, పవన్ లుక్ కాటామరాయుడు సినిమాలను పోలి ఉంది. ఏదైతేనేం ఈ పోస్టర్ లీకైన వార్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రస్తుతం పవన్ చెప్పే డైలాగ్ కూడా లీక్ కావడంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది.



























