Analist Damu Balaji : ఈషా ఫౌండేషన్ వ్యాపారాల చిట్టా ఇదే… ఆశ్రమం అక్రమ స్థలంలో కట్టాడా…: అనలిస్ట్ దాము బాలాజీ

0
163

Analist Damu Balaji : సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం గురించిన చర్చ ముదిరింది చివరకు సద్గురు వద్ద ఆగింది. అసలు జగ్గీ వాసుదేవ్ బాబా కు సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకోడానికి మధ్య సంబంధం ఏమిటనే ప్రశ్న మొదలయింది. అయితే సద్గురు వద్దకు వచ్చే వారికి వైవాహిక జీవితం పిల్లలను కనడం వంటివి వద్దు అని వారిని ప్రభావితం చేస్తారు అనే విమర్శలు ఉంది. ఆయన వద్ద ఆశ్రమంలో ఉన్న ఆడపిల్లలకు గుండు కొట్టి సన్యాసులను చేశాడంటూ ఆ అమ్మాయిల తల్లిదండ్రుల ప్రధాన ఆరోపణ. ఆయన మాత్రం కూతరు రాధే కి పెళ్లి చేసాడు కానీ ఇతరుల పిల్లలను సన్యాసులుగా మారుస్తున్నడంటూ ఆరోపిస్తున్నారు. ఇక జగ్గీ వాసుదేవ్ గురించి ఆయన బాక్ గ్రౌండ్ అలాగే ఆయన ఫౌండేషన్ గురించి మరిన్ని వివరాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

ఈషా సంస్థ ద్వారా చేస్తున్న పనులు…

జగ్గీ వాసుదేవ్ బాబా సేవ్ సాయిల్ పేరుతో లండన్ నుండి ఇండియా కు బైక్ మీద ప్రయాణించి అనేక దేశాల ప్రధానులను అలాగే అధ్యక్షులను కలిసారని అలాగే 3000 మంది పిల్లలకు విద్య అందిస్తున్నారని దాము బాలాజీ తెలిపారు. అయితే ఇవన్నీ ఒకటైతే అసలు కోయంబత్తురు లో పెట్టిన ఆశ్రమం అక్రమం అని తెలిపారు. ఆ ఆశ్రమం ఉండే చోటు ఫారెస్ట్ ఏరియా అని, అక్కడ ఏనుగులు సంచరిస్తూ ఉండేవని, ఏమాత్రం అనుమతులను తీసుకోకుండా పొలిటికల్ రిఫరెన్స్ తో ఆశ్రమం కట్టాడని అయితే ఒక ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడిగినపుడు వారిపై కోపం తెచ్చుకుని వారి కెమెరాలను ఆఫ్ చేయించడం జరిగిందట.

ఆ ఇంటర్వ్యూ ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక పర్యావరణంను కాపాడమని చెప్పే సద్గురు ఇలా ఆశ్రమం అక్రమంగా ఫారెస్ట్ లో కట్టడం ఏమిటి అంటూ అభిప్రాయపడ్డారు. ర్యాలీ ఫర్ రివర్ అంటూ జనాలలో బాగా సద్గురు తిరగాడు. ఆయన దేవుడిని నమ్మను అని చెబుతాడు కానీ శివుడు దేవుడు కాదంటూ చెప్తాడు. మీలో ఎన్లైట్మెంట్ నేను చేయిస్తానని మాత్రమే సద్గురు చెబుతాడంటూ దాము బాలాజీ వివరించారు.