Analist Damu Balaji : జగన్ తో నో వే అన్న మోడీ, అమిత్ షా… అవినాష్ కి ఓన్లీ వే జైలేనా… జైలు జీవితం గురించి అవినాష్ కు పాఠం చెప్పనున్న జగన్ : దాము బాలాజీ

0
71

Analist Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ కు కేసును సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం కలిగిస్తున్న ఈ కేసులో అవినాష్ రెడ్డిని తరచూ సిబిఐ విచారిస్తుండగా అరెస్టు తప్పదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జగన్ అవినాష్ రెడ్డిని వెంట బెట్టుకుని మోడీ, అమిత్ షాలను ఢిల్లీ వెళ్లి కలవడం వంటి పరిణామాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అవినాష్ విషయంలో హ్యాండ్ ఇచ్చిన మోడీ…

వివేకానంద రెడ్డి కేసులో తొలి నుండి అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తుండగా తాజాగా ఆయన నిందితుడా లేక సాక్షినా అనే విషయంలో హై కోర్ట్ సిబిఐ ను ప్రశ్నించింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను హై కోర్ట్ కు సమర్పించగా పరిశీలించిన హై కోర్ట్ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో తాము జోక్యం చేసుకోమని, సిబిఐ వారి ఇష్టం అన్నట్లుగా తీర్పు ఇచ్చిందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ఇక హై కోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అవినాష్ రెడ్డి అరెస్టు త్వరలో ఉండబోతోందనే సంకేతలు కనిపిస్తున్నాయి.

అందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏమాత్రం ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోకుండా ప్రధాని అలాగే హోమ్ మంత్రి అమిత్ షాను కలవడానికి ఢిల్లీ వెళ్లారు సీఎం జగన్. ఇక జగన్ తనతో పాటు అవినాష్ రెడ్డిని కుడా వెంటబెట్టుకు వెళ్లారు. అయితే మోడీ అమిత్ షా అవినాష్ తో కలవలేదు, కేవలం ఇగన్ మాత్రమే వారితో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక కేసు విషయంలో జోక్యం చేసుకుని విచారణ నెమ్మదిగా జరిగేలా అలాగే అవినాష్ రెడ్డిని అరెస్టు నుండి తప్పించమని అడిగినట్లు తెలుస్తోంది. కానీ మోడీ అమిత్ షా ఈ విషయంలో సానుకూలంగా స్పందించినట్లు కనబడటం లేదని ప్రచారం జరుగుతోందని దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.