Analist Damu Balaji : నందమూరి తారక రత్న గత నెల 18న మరణించారు. కుప్పం పాదయాత్రలో పాల్గొన్న ఆయన అక్కడ తీవ్ర గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ఆపైన బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకోవడం, 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించడం అందరినీ కలచివేసింది. ఇక తారకరత్న గారికి భార్య ముగ్గురు పిల్లలు కాగా ఆయనది ప్రేమ వివాహం. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకుని కుటుంబానికి దూరమయ్యారు. ఇరు కుటుంబాలు తారకరత్న అలేఖ్య రెడ్దిలను దూరం పెట్టడంతో మొదట్లో ఆర్థికంగా బాగ ఇబ్బందులు పడ్డారు. అలా సాగుతున్న జీవితంలో ఇప్పుడిప్పుడే కొంచం కుటుంబానికి తారకరత్న చేరువవుతున్నాడు అనే సమయంలో ఇలా మృత్యువు దూరం చేసింది. ఇక ఆయన నెల మాసికం రోజున ఆయన భార్య అలేఖ్య రెడ్డి వారి ప్రేమ గురించి పెళ్లి పిల్లలు ఎంత ఇబ్బందులను వారు ఎదుర్కొన్నది అన్ని విషయాలను పోస్ట్ పెట్టి అందరినీ ఎమోషనల్ చేసింది. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్స్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఒంటరి అయిన అలేఖ్య రెడ్డి…
మొదటి నుండి మోహన్ కృష్ణ గారికి కొడుకు పెళ్లి నచ్చలేదు అందుకే అతడిని ఆయన కుటుంబాన్ని దూరంగా పెట్టాడు. అలా చివరకు తారకరత్న మరణించిన తరువాత కూడా మోహన్ కృష్ణ గారు కొడుకు కుటుంబాన్ని దూరం పెట్టాడం అందరికీ ఆశ్చర్యం కలిగించిందంటూ అనలిస్ట్స్ దాము బాలాజీ అలాగే దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. అయితే నెల మాసికం రోజున నీ సమాధి వద్ద కూడా ఎవరూ నిన్ను పట్టించుకోలేదు అంటూ అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టడంతో ఆ పొస్ట్ చదివిన వాళ్ళు ఎమోషనల్ ఆవుతున్నారు.

పాప పుట్టేవరకు తాము ఎన్ని ఇబ్బందులు పడ్డది అలాగే కుటుంబానికి దూరమై ఎంత బాధపడ్డది అంటూ అలేఖ్య రెడ్డి రాసుకోచ్చారు. ఇక మొదటి నుండి ఆదుకున్నది బాలకృష్ణ, విజయసాయి అంటూ అలేఖ్య చెప్పారంటూ ముఖ్యంగా ఆమెకు అత్తింటి సపోర్ట్ లేకుండా పాయిందని అనలిస్ట్స్ అభిప్రాయపడ్డారు.