Analist Damu Balaji : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఇప్పటికే హరిహర కృష్ణ లొంగిపోగా తాజాగా హరిహర స్నేహితుడు హాసన్ అలాగే ప్రియురాలు నిహారికను పోలీసులు అరెస్ట్ చేసారు. హరిహర మాత్రమే హత్య చేయగా విషయం తెలిసిన వాళ్ళలో నిహారిక, హాసన్ అలాగే హరిహర తండ్రి ఉన్నారు. అయితే నిహారిక, హాసన్ ఇద్దరూ విషయం తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అయితే తమకేమీ తెలియదు అంటూ ఇంతవరకు బుకాయించినా వీళ్లిద్దరూ దొరికిపోయారు. ఏకంగా హత్య జరిగిన చోటుకు వెళ్లి మరీ చూసి అక్కడి నుండి రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీ తిన్నారు ముగ్గురూ. ఈ విషయాలన్నీ బయట పడటంతో ఇప్పుడు నిహారిక రెడ్డి అలాగే హాసన్ కి కూడా ఈ కేసులో శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించిన విషయాలను ఇటీవలే డీసీపీ సాయిశ్రీ మీడియా సమావేశంలో తెలిపిన విషయాలు అలాగే హరిహర ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో వచ్చిన విషయాలలో కొన్నింటికి పొంతన లేకపోవడం వల్ల డీసీపీ కేసును పక్కదారి పట్టించారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

రిపోర్ట్ ను తప్పుదారి పట్టిస్తున్నారా…
హరిహర ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో నిహారికను నవీన్ మొదట ప్రేమించినా మధ్యలో ఇంకో అమ్మాయితో తిరగడం వల్ల నవీన్ ను నిహారిక దూరం పెట్టింది. ఆ తరువాత నిహారిక నన్ను ప్రేమించింది, మేమిద్దరం ప్రేమలో ఉన్నపుడు కూడా నవీన్ నిహారికకు ఫోన్లు చేయడం, ప్రేమిస్తున్నానని వేధించడం చేసేవాడు అందుకే నవీన్ ను హత్య చేయాలని మూడునెలల ముందే ప్లాన్ చేసుకుని జనవరి 17న చంపాలని అనుకున్నా అపుడు కుదరలేదు, చివరికి ఫిబ్రవరి 17న తానే ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పడంతో ఆ రోజు చంపాలని అనుకున్నట్లు తెలిపారు. ఇక రాత్రి ఇద్దరూ తాగిన తరువాత నిహారిక గురించి మాట్లాడే సమయంలో గొడవ జరిగి దెబ్బలాడుకున్నామని ఆపైన ముందుగా అనుకున్నట్లుగా చేతికి గ్లౌస్ వేసుకుని నవీన్ ను గొంతు నులిమి చంపి ఆపైన కత్తితో కోసినట్లు తెలిపాడు. అయితే ఇందులో ఎవరి ప్రమేయం లేదు అన్నట్లుగా హరిహర స్టేట్మెంట్ ఉంది. ఇక నిహారిక హత్య తరువాత కలిసి హత్య చేసినట్లు చెబితే తిట్టిందని పోలీసులకు లొంగిపొమ్మని చెప్పిందని రిపోర్ట్ లో పేర్కొన్నాడు హరిహర.

అయితే డీసీపీ సాయిశ్రీ చెప్పినపుడు నిహారిక ఖర్చులకు డబ్బులు ఇచ్చిందని హత్యలో తన ప్రమేయం లేదని వివరించారు. ఇక్కడే అసలు రిమాండ్ రిపోర్ట్ కి డీసీపి చెబుతున్న విషయాల్లో పొంతన కరువైంది, అనుమానాలు వస్తున్నాయి అంటూ దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు. మీడియా అటెన్షన్ ఉన్నంత సేపు కేసు గురించిన వివరాలు తెలుస్తాయి ఆపైన కోర్ట్ కి వెళ్ళాక లాయర్ల చేతిలో తరుమారు అయిపోతాయి అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. అందుకే హరిహర కు చట్టంలోని లూప్ హోల్స్ బాగా తెలుసు అందుకే నేను బయటికి వస్తాను అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు అంటూ వివరించారు.