Analist Damu Balaji : కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి అనే యువతి గత బుధవారం డ్యూటీలో ఉండగానే హానికర ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ అనస్థిషియా పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు ప్రీతి ఆత్మహత్యా యత్నం చేయగా గురువారం నాడు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇచ్చే డిపార్ట్మెంట్ లో డ్యూటీ నిర్వహిస్తున్న ప్రీతి అక్కడే ఉన్న ప్రమాదకర ఇంజక్షన్ ను వేసుకుంది. మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరకు ఓడిపోయింది. ఆమెది ఆత్మహత్య కాదు కాలేజీలో ఏదో జరిగింది అంటూ ప్రీతి కుటుంబం ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం ర్యాంగింగ్ కు బలైంది. తాజాగా ఆమె టాక్సికాలజీ రిపోర్ట్ వెలువడింది. అందులో వచ్చిన ఫలితాలు ఆమెది ఆత్మహత్య కాదు అనేలా రిపోర్ట్ రావడం పట్ల అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషించారు.

ప్రీతిది ఆత్మహత్య కాదు హత్య…
దాము బాలాజీ మాట్లాడుతూ ప్రీతి విషయంలో ఇప్పటి వరకు ఆత్మహత్య అని అందరూ భావించినా అందుకు తగిన ఆధారాలు టాక్సికాలజీ రిపోర్ట్ లో లభించలేదని చెప్పారు. టాక్సికాలాజీ రిపోర్ట్ లో శరీరంలోని గుండె, లివర్, కిడ్నీ వంటి అవయవాలలో ఎటువంటి విషపూరిత పదార్థాలు కనిపించలేదని రిపోర్ట్ సారాంశం. దీంతో ప్రీతిది ఆత్మహత్య కాదు అని అర్థమైంది.

అలాంటపుడు ప్రీతి మృతికి కారణాలు ఏమిటి, తాను ఎలా మరణించింది, కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు ఆమెను హత్య చేసారా అన్నది తేలాల్సి ఉంది అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆమెను హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిజానిజాలు తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని నియమించగా కాకతీయ యూనివర్సిటీలోను యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరుపుతోంది.






























