Analist Dasari Vignan & Damu Balaji : నందమూరి తారకరత్న మరణం నందమూరి ఇంట విషాదం మిగల్చగా ఆయన మరణం గురించి అనేక చర్చలు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ఆయన మరణం తరువాతే ఆయన భార్య పిల్లల గురించి సోషల్ మీడియాలో ఫోకస్ ఎక్కువైంది. ఇక అలేఖ్య రెడ్డిది రెండో వివాహం కావడం వల్ల అలేఖ్య రెడ్డి ఎవరు, మొదట భర్త ఎవరు లాంటి చర్చలు అనేకం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు తారకరత్న పెద్ద కూతురు నిషిక గురించి మొదలు పెట్టారు. నిషిక అలేఖ్య రెడ్డి మొదటి భర్త కూతురుంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. దీని గురించి అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ అలాగే దాము బాలాజీ మాట్లాడారు.

నిశిక ఎవరి కూతురంటే…
అలేఖ్య రెడ్డి మొదటి వివాహం చేసుకున్నది మాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డిని. అయితే అభిప్రాయ బేధాల వల్ల వాళ్ళు ఎంతో కాలం కలిసిలేరు. పెళ్ళైన కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తరువాత అలేఖ్య రెడ్డికి తారకరత్న పరిచయం అవ్వడం ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం జరిగాయి.

ఇక వారి ప్రేమ గుర్తే మొదటి పాప నిషిక. ఆ పాప తరువాత చాలా గ్యాప్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ముగ్గురికి తాత గారి పేరు వచ్చేలాగా నిషిక, తనయ్ రామ్, రియా అంటూ పేర్లను పెట్టారు. సోషల్ మీడియాలో నిషిక తారకరత్న కూతురు కాదు అని వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ వివరించారు.
































