Analyst Shravan Kumar : దర్శకధీరుడు రాజమౌళి ఇంత వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ గా రికార్డు సృష్టించాడు. ఇక లేటెస్ట్ గా అయితే ఏకంగా తన సినిమాలోని పాటకు ఆస్కార్ అందుకుని ఇండియాకే ప్రైడ్ గా నిలబడ్డాడు. ఇక అలాంటి దర్శకుడు ఒక ఆర్టిస్ట్ తో గొడవ అది కూడా ఒక విలక్షణ నటుడుతో వైరం పెట్టుకుని సినిమాలో తీసుకోలేదనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అసలు నిజానిజాలను అనలిస్ట్ శ్రవణ్ కుమార్ వివరించారు.

విక్రమార్కుడు తప్పు మరో సినిమా చేయలేదు…
ప్రకాష్ రాజ్ మంచి నటుడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేస్తారు. ఆయన ఒక భాషకు పరిమితమైన నటుడు కాదు, దాదాపు దక్షిణాదిన అన్ని భాషల్లోను నటించి మెప్పించారు. అలాంటి విలక్షణ నటుడుని రాజమౌళి తన సినిమాల్లో తీసుకోకపోవడానికి కారణం ఏమిటని అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ గారు ఒక భాషలో నటిస్తూ ఉండే వ్యక్తి కాదు అయన బిజీగా ఉంటారు. ఇక రాజమౌళి సినిమాలో యాక్టర్ అంటే ఏళ్లకేళ్ళు షూటింగ్ చేయాలి కాల్షీట్స్ గంపగుత్తగా ఇచ్చేయాలి.

అక్కడ ఇద్దరూ క్లాష్ అయి ఉండవచ్చు. వీరిద్దరి కాంబినేషన్ విక్రమార్కుడు సినిమాలో ఉంది. అయితే రీపిట్ కాకపోడానికి ఇది ఒక కారణం కావచ్చు. ఇక రాజమౌళి తండ్రి ఆర్ఎస్ఎస్ భావజాలం గల వ్యక్తి, ప్రకాష్ రాజ్ గారు లౌకిక వాది అందుకే తెసుకోలేదేమో. ఇక అదీ కాక ప్రకాష్ రాజ్ గారి మీద తెలుగు ఇండస్ట్రీలో టైంకి రాడు అనే వాదన ఉంది. ఆయన మీద బ్యాన్ కూడా పడింది అందుకే ఆయనను తీసుకోకపోయిండొచ్చు అంటూ శ్రవణ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.































