Analyst Damu Balaji : సచివాలయ వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలకు నిరసనగా వైసీపీ ఆందోళన, వారికి వ్యతిరేకంగా జనసేన ఆందోళనలు తెలిసిందే. అయితే ఆ సమయంలో జనసేన కార్యకర్త మీద చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తనకు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో అంజు యాదవ్ మీద ఛార్జ్ వేయడం, నోటీసులు పంపడం ఇవన్నింటి తరువాత ఇపుడు అంజు యాదవ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఉద్యోగానికి రాజీనామా… త్వరలో పొలిటికల్ ఎంట్రీ…
అంజు యాదవ్ తాజాగా జనసేన కార్యకర్త మీద చేయిచేసుకోవడంతో ఒక్కసారిగా ఆమె గతంలో చేసిన ఇలాంటి పనుల వీడియోలు కూడా వైరల్ అయి ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. అంజు యాదవ్ శ్రీకాళహస్తి సిఐ గా ప్రస్తుతం ఉన్నారు. ఆమెది కడప జిల్లా కాగా ఎస్ఐ గా ఉధ్యోగంలో చేరి ఆపైన ఇపుడు సిఐ అయ్యారు. అలిపిరి బాంబు ఘటన సమయంలో చంద్రబాబు కాన్వాయ్ లో ఆమె కూడా ఉండగా అందరి కంటే ముందు వేగంగా స్పందించి ప్రశంసలు అందుకున్నారు అంజు యాదవ్ అంటూ బాలాజీ తెలిపారు.

మొదటినుండి రాజకీయాలంటే ఇష్టం ఉన్న అంజు యాదవ్ ఎలాగైనా జగన్ దృష్టిలో పడాలని భావించి వివాదాస్పద పనులు చేసారు అంటూ బాలాజీ తెలిపారు. తాజాగా ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి తిరుపతి నుండి పవన్ కి పోటీగా కానీ లేక మదనపల్లి లేదా చిత్తూరు నుండి కానీ పోటీ చేసే అవకాశం ఉందని ఇంకా క్లారిటీ గా విషయం బయటికి తెలియాల్సి ఉందని బాలాజీ తెలిపారు.