Analyst Damu Balaji : అన్నపై మంచు మనోజ్ సోషల్ మీడియాలో మరోసారి కామెంట్స్… బతకండి.. బతకనివ్వండి అంటూ పోస్ట్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
78

Analyst Damu Balaji : సోషల్ మీడియాలో ఏదైనా సెలెబ్రిటీలకు సంబంధించి చిన్న వివాదం జరిగినా బాగా వైరల్ అయి కూర్చుంటుంది. దాని మీద చర్చలు, విశ్లేషణలు అంటూ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపేస్తున్న మ్యాటర్ మంచు ఫ్యామిలీకి సంబంధించిన అన్నదమ్ముల గొడవ. సాధారణంగా బయట కామన్ గా అన్నదమ్ముల మధ్య మనస్పర్తలు రావడం లాంటివి జరుగుతుంటాయి. అయితే వీళ్ళు సెలబ్రిటీలు అవ్వడం వాళ్ళ ఈ గొడవ వైరల్ అవుతోంది. ఇక ఇంట్లోనే ఉండవలసిన గొడవను కాస్తా మనోజ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రచ్చకీడ్చడంతో మరింత వైరల్ అయింది. మోహన్ బాబు కలగజేసుకోవడంతో మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేసినా మరోసారి బతకండి.. బతకనివ్వండి.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో మరోసారి ఈ గొడవ గురించి చర్చ మొదలయింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మనోజ్ యుద్ధం అయిపోలేదని చెప్పకనే చెబుతున్నాడు…

అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ నిన్న మనోజ్ పెట్టిన పోస్ట్ లో బతకండి బతకనివ్వండి అంటూ పెట్టడం గురించి మాట్లాడుతూ తాను యుద్ధంలోనే ఉన్నట్లు తన వాళ్ళ జోలికి రాకండి అన్నట్లుగా తెలుస్తోంది. మరో పోస్ట్ లో అది స్పష్టం అవుతుంది. నన్ను రెచ్చగొట్టకండి అన్నట్లుగా పోస్ట్ పెట్టాడు. తానకు కావాల్సినవి తాను వదులుకోడు, ఎవరి జోలికి తాను రాడు కానీ తన జోలికి వస్తే యుద్ధం చేస్తాను అనే అర్థం వచ్చేలా మనోజ్ పోస్ట్ పెట్టడానికి గొడవలకు అసలు కారణం మనోజ్ పెళ్లి అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డారు.

మనోజ్, మౌనిక పెళ్లిని మొదటి నుండి విష్ణు ఒప్పుకోలేదని అందువల్లే ఇప్పుడు మరింత గొడవలు రాజుకున్నాయంటూ అభిప్రాయపడ్డారు. అయితే మధ్యలో సారధి అనే వ్యక్తి ఇద్దరికీ మధ్య మరింత విబేధాలు వచ్చేలా చేసాడు అనే పుకార్లు ఉన్నాయంటూ చెప్పారు బాలాజీ. అందుకే సారధితో మాట్లాడాలని విష్ణు కాల్ చేసినా అతను స్పందించక పోయేసరికి ఇంటికి వెళ్లి మాట్లాడాడు అనే టాక్ నడుస్తోందని, ఒకసారి మోహన్ బాబు కూర్చొని ఇద్దరితో మాట్లాడితే సర్దుకునే విషయమే అయినా మనోజ్ సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్దగా అయిందంటూ చెప్పారు బాలాజీ.