Analyst Damu Balaji : అప్సర హత్య కేసులో పోలీసుల ఛార్జ్ షీట్ లో నిజాలు…: అనలిస్ట్ దాము బాలాజీ

0
81

Analyst Damu Balaji : సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర తండ్రి కాశిలో పని చేస్తుండగా ఇక్కడ తల్లి వద్దే ఉంది అప్సర. ఇక తనకు ఒక అక్క ఉండగా ఆమెకు పెళ్ళై చెన్నై లో ఉంది. అప్సర గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి. చివరకు సాయి కృష్ణ అప్సరను హత్య చేసాడు. ఆమె మృత దేహాన్ని మ్యాన్ హోల్ లో పడేసి ఆధారాలను లేకుండా చేసే ప్రయత్నం చేసాడు. ఇక ఈ కేసులో అప్డేట్ ను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు…

సరూర్ నగర్ వెంకట సాయి కేసులో అప్సర ను హత్య చేసి సాక్ష్యాలు మాయం చేయాలని చేసిన కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. గత నెలలో సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కోర్టులో పోలీసులు ఛార్జ్ షీట్ వేయబోతున్నట్లు బాలాజీ తెలిపారు.

అప్సర హత్య కేసులో వెంకట సాయి హత్యనేరం ఒప్పుకోగా అప్సర పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడం వల్ల క్షణికావేశంలో హత్య చేసానంటూ చెప్పాడు. అయితే ఆమెను చంపి శవాన్ని మ్యాన్ హోల్ లో పడేసి సాక్ష్యం లేకుండా చేసిన నేరంలో ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందని త్వరలో పోలీసులు ఛార్జ్ షీట్ రంగారెడ్డి కోర్టులో సమర్పించబోతున్నారని బాలాజీ తెలిపారు.