Analyst Damu Balaji : ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మీడియాలో కథనాలు ఇంటర్వ్యూలంటూ హోరెత్తిస్తున్న టాపిక్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. మొదట గుండె పోటు అన్నప్పటి నుండి నేడు హత్య వరకు అనేక మలుపులు తిరిగి అయన వ్యక్తిగత జీవితం అన్నీ బయటకి వస్తూ డైలీ సీరియల్ లాగా రోజుకో కొత్త ఎపిసోడ్ నడుస్తోంది. రోజుకో కొత్త క్యారెక్టర్ నేనే మెయిన్ లీడర్ అన్నట్లుగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ కేసులో సిబిఐ వివేకానంద తలకి కుట్లు వేసిన నర్సు జ్యోతిని విచారించారు. ఇక ఈ విషయాల మీద తమ అభిప్రాయాలను పంచుకున్నారు అనలిస్ట్ దాము బాలాజీ.

అవినాష్ చుట్టూ సిబిఐ…
సిబిఐ విచారణ అవినాష్ రెడ్డిని నిందితుడు అని తెల్చాలి అన్నట్లుగా ఉంది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. కేసులో హత్య నేనే చేశాను అని చెబుతున్న దస్తగిరి, చేయించింది ఎర్ర గంగిరెడ్డి అని చెబితే ఆ ఎర్ర గంగి రెడ్డిని వదిలి కేసు అవినాష్ వద్ద ఆగింది. అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దరూ వివేకానంద హత్య తరువాత సాక్ష్యాలను మాయం చేయడానికి రక్తాన్ని తుడిచేయడం వంటివి చేసారనే ఆరోపణల నడుమ వాళ్ళే నిందితులు అన్నట్లుగా సిబిఐ విచారణ జరుగుతోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.

ఇక తాజాగా వైఎస్ భారతి తండ్రి గారి హాస్పిటల్ లోని స్టాఫ్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డి, జ్యోతి లే వివేకానంద తలకు కుట్లు వేశారు. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డిని రిమాండ్ కు తరలించిన పోలీసులు తాజాగా నర్సు జ్యోతిని విచారిస్తున్నారు. విచారణ మొత్తం అవినాష్ రెడ్డి అరెస్టు కోసమే అన్నట్లుగా ఉంది అంటూ బాలాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.


































