Analyst Damu Balaji : ఆయనని పట్టిస్తే కోటి రివార్డు… కటకం సుదర్శన్ షాకింగ్ ఫ్లాష్ బ్యాక్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
219

Analyst Damu Balaji : నక్సలిజం, మావోయిస్టులు ఈ పేర్లు ఇప్పుడు వినడం తక్కువైంది కానీ ఒకప్పుడు అన్నల పేరు చెబితే పల్లెల్లు భయపడేవి. తుపాకీ పడితేనే న్యాయం జరుగుతుందని సాయుధ తిరుగబాటుతోనే దేశంలో న్యాయం ఉంటుందని భావించి అడవిలో ఉంటూ పోలీసుల మీద, రాజకీయ నాయకుల మీద పోరాడుతున్నా సామాన్య జనంకు అండగా ఉన్నాం అంటూ చెప్పే మావోయిస్టు దలాలు ప్రస్తుతం అంత యాక్టీవ్ గా లేవు. ఒకప్పటి నక్సలిజంతో పోలిస్తే ఇపుడు బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ప్రభావం తగ్గింది. ఇంకా ఛత్తీష్గడ్ ప్రాతంలో ఇప్పటికీ కొంత ప్రభావం చూపుతున్నారు. అయితే తాజాగా మావోయిస్టు ప్రధాన నేత అయిన కటకం సుదర్శన్ అలియాస్ మోహన్ అలియాస్ ఆనంద్ అనే వ్యక్తి గుండె పోటుతో మే 31 న మరణించారు. అయితే ఈ నేత గురించి మరిన్ని విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

ఆయనను పట్టిస్తే కోటి రివార్డు…

కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ఈయన మావోయిస్టు ప్రధాన నేతలలో ఒకరు. అరవై ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించిన ఆయనను ప్రభుత్వానికి పట్టిస్తే కోటి రూపాయల రివార్డు ఇస్తామనే ప్రకటన కూడా ఉండేదని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ఇక ఆనంద్ పుట్టింది ఆదిలాబాద్, పాలిటెక్నిక్ చదివే సమయంలో ఒక మహిళ మీద అత్యాచారం జరగడంతో ఆమె ఉరి వేసుకుని మరణించిన ఘటనతో రాడికల్స్ వైపు మళ్ళారు. స్టూడెంట్ రాడికాల్ లీడర్ గా ఎదిగిన అయన చదువుయ్యాక మావోయిస్టు గ్రూప్ లో చేరారు. మొదట ఛత్తీష్గడ్ లో పనిచేసిన ఆయన ఆ పైన దండకారణ్యంకి వెళ్లారు. అక్కడ ప్రధాన నేతల్లో ఒకరిగా ఉన్న ఆనంద్ 30 సంవత్సరాలు అక్కడే పనిచేసారు.

ఆనంద్ 1975లో రాడికల్ లెఫ్టిస్టులలో చేరి ఆ పైన 1979లో ఛత్తీస్‌గఢ్‌కు మారాడు. 1980లో కొండపల్లి సీతారామయ్య స్థాపించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, పీపుల్స్ వార్ లో సభ్యుడు అయ్యాడు. ఆనంద్ కఠినమైన గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ప్రసిద్ధి చెందారు అలాగే ఛత్తీస్‌గఢ్ భూభాగంలో గెరిల్లా వార్‌ఫేర్ లో క్యాడర్‌లకు శిక్షణ ఇవ్వడం మరియు సాయుధ బలగాలపై ఖచ్చితంగా దాడులు చేసేలాగా మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడంలో సిద్ధహాస్తుడు అంటూ తెలిపారు బాలాజీ. అయితే ఆయనతో కొద్ది రోజులు కలిసి పనిచేశారట, ఆయన చాలా మృధుస్వభావి అంటూ తుపాకీలను వారే తయారు చేసుకోవడం నుండి ఏదైనా పోరాటం చేస్తున్నపుడు ఎలాంటి ప్లాన్ ఉండాలి అన్న విషయాలను ఆనంద్ ఆయన సభ్యులకు నేర్పించేవారని తెలిపారు.