Analyst Damu Balaji : వైజాగ్ శ్వేత ఆత్మహత్య కేసులో ఇప్పటికీ ఆమె అత్తింటి వారు జైలులో ఉన్నా కేసు మాత్రం నత్తనడకన సాగుతోంది. పోలీసులు ఇప్పటికే ఇదో అనుమానస్పద మృతి కాదు ఆత్మహత్య అని క్లారిటీగా చెబుతున్నా ప్రస్తుతం శ్వేత ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రమే క్లారిటీగా ఆ విషయాన్ని ధ్రువీకరించాలి. అయితే రిపోర్ట్ అఫీసియల్ గా బయటికి రాకపోయినా లీకులు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక శ్వేత కేసులో అసలేం జరుగుతోంది అనే విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఆ బట్టలు ఆమెవి కాదు…
దాము బాలాజీ శ్వేత కేసు గురించి మాట్లాడుతూ ఫోరెన్సిక్ నుండి వచ్చిన లీక్ బట్టి శ్వేత బట్టలుగా భావిస్తున్న బట్టలు ఆమెవి కాదు అని తెలిపారు. ఆమె డిఎన్ఏ తో బట్టలు మ్యాచ్ కాలేదని తెలిపారు. అయితే పూర్తిగా క్లారిటీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటికి వచ్చాక తెలుస్తుంది.

అయితే ఫోన్ లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి అంటూ తెలిపారు. ఇక కేసులో శ్వేత తల్లి ఎంత పోరాడినా ఈ కేసు నిలబడదు. అక్కడ శ్వేత అత్తింటి వారికీ బాగా పలుకుబడి, డబ్బు ఉన్న కారణంగా మీడియా ఫోకస్ ఉన్నంత వరకు ఈ కేసు కనిపిస్తుంది ఆపైన శిక్ష పడకపోవచ్చు అంటూ బాలాజీ తెలిపారు.






























