Analyst Damu Balaji : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి బయట ప్రైవేట్ పార్టీస్ లో కలిస్తే ఇక వారి మధ్య ఏదో ఉందంటూ వార్తలు షికారు కొడతాయి. ఇది కేవలం హీరో హీరోయిన్ల విషయంలోనే కాదు మిగిలిన సెలబ్రిటీల విషయంలో ఇలానే పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ప్రేమ, పెళ్లి, విడాకులు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్. తాజాగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ విషయంలో కూడా ఇలాంటి ఒక పుకారు బాగా గట్టిగా వినిపిస్తోంది. ఇక ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఊ అంటావా సింగర్ తో ఊ అంటున్న దేవిశ్రీ…
దేవిశ్రీ ప్రసాద్ ఇపుడున్న తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ పొజిషన్ లో ఉంటూ మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ. తన మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడుకుంటారో తన పెళ్లి గురించి కూడా రూమర్స్ అంతే బాగా వినిపిస్తుంటాయి. రైటర్ సత్యానంద్ గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన తాజాగా ఊ అంటావా మావ ఊఉ అంటావా మావ పాట పాడి బాగా ఫేమస్ అయిన సింగర్ ఇంద్రవతి చౌహన్ తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయంటూ బాలాజీ తెలిపారు.

రీసెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు నాడు ఆమె సోషల్ మీడియాలో వారిద్దరూ ఉన్న ఫోటోలు షేర్ చేయగా ఆ ఫోటోల్లో వారిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగు పదుల వయసులో ఉన్న దేవిశ్రీ ముప్పై ఏళ్లు కూడా లేని ఇంద్రవతి చౌహన్ తో ప్రేమలో ఉన్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఛార్మితో పీకల్లోతు ప్రేమలో ఉన్న దేవిశ్రీ ఆమెతో బ్రేక్అప్ అయ్యాడు, ఛార్మి దేవిశ్రీ ని వదిలి వెళ్ళిపోయిందంటూ అందుకే కొంతకాలం కెరీర్ కి కూడా గ్యాప్ ఇచ్చాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయని బాలాజీ తెలిపారు. ఇక ఈ రూమర్ లో నిజమెంతో వాళ్ళిద్దరే క్లారిటీ ఇవ్వాలంటూ చెప్పారు.