Analyst Damu Balaji : ఎన్డిఏ మీటింగ్ లో లేని చంద్రబాబు… పవన్ వద్దన్నాడా… అసలు ఏం జరిగింది…: అనలిస్ట్ దాముబాలాజీ

0
146

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాలన్నీ ఇపుడు బిజెపితో జాతకట్టడానికి తహతహలాడుతున్నాయి. బహిరంగంగా పవన్ కళ్యాణ్ కలిసే ఉండగా, లోపకారిగా వైసీపీ ఉంది. ఇక నేను మీతో వస్తా అంటూ టీడీపీ స్నేహ హస్తం చాటుతుండగా ఏపీ క్షేత్ర స్థాయిలో మాత్రం బీజేపీ కి ఏమాత్రం పట్టు లేదు. అయినా ఆ పార్టీ వెనుకే పడటానికి కారణం కేంద్రంతో పెట్టుకుంటే ఏమవుతుందో గత ఎన్నికలే నిదర్శనము కాబట్టి టీడీపీ జాగ్రత పడుతుంటే, వైసీపీ కూడా ఎక్కడ టీడీపీ బిజెపి ని తగులుకుంటుందో అని జాగ్రత్తపడుతోంది. ఇక ఇటీవలే ఎన్డిఏ మిత్రపక్షాల సమావేశం జరుగగా అందులో ఏపీ నుండి వెళ్లిన పార్టీ జనసేన మాత్రమే. టీడీపీ కనిపించకపోయేసరికి ఇక టీడీపీ తో బీజేపీ ఉండదు అనే మాటలు వినిపిస్తున్నాయి. వీటి మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

చంద్రబాబు కు ఎన్డిఏ గుడ్ బై చెప్పిందా…

అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ ఒకప్పుడు ఎన్డిఏ లో ఉన్న బలమైన పార్టుకు టీడీపీ అలాగే పంజాబ్ నుండి అకాళిదళ్. ఇపుడు ఎన్డిఏ లో ఆ రెండు పార్టీలు లేవు అంటూ చెప్పారు. ఇదే విషయం గురించి అమిత్ షా ను మీడియా అడిగినపుడు ఎన్డిఏ నుండి వాళ్ళే స్వచ్చందంగా వెళ్లిపోయారు ఇపుడు మళ్ళీ వాళ్ళే వస్తామంటే తలుపులు తెరిచే ఉంటాయి అంటూ చెప్పారు. చంద్రబాబు వస్తానంటే ఎన్డిఏ వద్దనదు అంటూ ఆయన మాటల ఆంతర్యం అంటూ అయితే ప్రస్తుతం ఎన్డిఏ లో ఉన్న పార్టీలలో ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకున్న పెద్ద పార్టీ లేదు.

కేవలం మోడీ చరిష్మా, హిందూత్వ అజెండా మీదే ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. కానీ మొన్నటి కర్ణాటక ఎన్నికలు బీజేపీ పగటికలలకు అడ్డుకట్ట వేసాయి. అందుకే ఇపుడు జాగ్రత పడాలని భావిస్తున్న ఎన్డిఏ మిత్ర పక్షాలతో భేటీ అయ్యారు. నిజానికి ఏపీ నుండి జనసేన ఆఫషియల్ గా ఎన్డిఏ మీటింగ్ కి వెళ్ళింది కానీ లోపల వైసీపీ, ఇటు తెలంగాణ లో బిఆర్ఎస్ కూడా వాటికి అనుకూలంగానే ఉంటాయి. అయితే ఒకవేళ వచ్చే ఎన్నికలలో బీజేపీ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కాకపోతే బహిరంగంగా చేయరు, ఎవరి ఓట్ల సమీకరణాలు వాళ్ళవి అంటూ చెప్పారు బాలాజీ.